రీమేక్ సినిమాతో పదేళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి మరోసారి రీమేక్ చిత్రాన్నే ఎంచుకున్నారు. ఇటీవల మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా హీరో పృథ్విరాజ్ కుమారన్ డైరెక్ట్ చేసిన చిత్రం `లూసీఫర్`. ఈ చితత్రాన్ని తెలుగులో ఇదే పేరుతో రిలీజ్ కూడా చేశారు. అయితే అది పెద్దగా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. అదే సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ముచ్చటపడిన చిరు, రామ్‌చరణ్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్‌లో రామ్‌చరణ్, కొరటాల శివ చిత్రంతో చిరు బిజీగా వుండటంతో `లూసీఫర్` రీమేక్‌కు కొంత టైమ్ పట్టేలా వుంది. అయితే ఈ సినిమాని ఎప్పుడు మొదలుపెడతారు?. ఎవరు దర్శకుడు? అనే చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వి.వి.వినాయక్ అయితేనే కరెక్ట్ అని మెగాస్టార్ భావిస్తున్నారట. ఇప్పటికే అతనికి చిరు నుంచి కాల్ వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముందు ఈ రీమేక్‌ని సుకుమార్ తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. అయితు అందులో ఎలాంటి వాస్తవం లేదని, వినాయక్ నే చిరు ముందు నుంచి ప్రిఫర్ చేస్తున్నారని మెగా క్యాంప్ చెబుతోంది.
గతంలో వి.వి.వినాయక్ – చిరు కాంబినేషన్‌లో `ఠాగూర్`, `ఖైదీ నంబర్ 150` వంటి హిట్ చిత్రాలు వచ్చిన విషయం తెలిపసిందే. ఈ రెండూ రీమేక్ చిత్రాలే. ఈ కారణంగానే “లూసీఫర్` కోసం వినాయక్‌నే కావాలని చిరు నిర్ణయించుకున్నారట.