నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ టాక్, కథ
అనుకున్నట్లుగానే ఈ రోజు ‘నానీస్ గ్యాంగ్ లీడర్’మన ముందుకు వచ్చింది. ‘జెర్సీ’ లాంటి ఎమోషనల్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టిన నాని.. ‘గ్యాంగ్ లీడర్’తో బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు, థియేటర్‌లో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తానని హామీ ఇస్తున్నాడు. నానికి తోడు విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా జతకలవటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షోలు చాలా చోట్ల పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న టాక్ , కథ మీకు అందిస్తున్నాం.
ముందుగా కథేంటో చూద్దాం…
బ్యాంగ్ దొంగతనం తో ప్రారంభమయ్యే ఈ సినిమాలో …ఈ రాబరీలో పాల్గొన్న ఐదుగురిని మోసం చేసి ఆరోవాడు ఆ డబ్బుతో పరార్ అవుతాడు. అంతేకాదు ఆ దొంగ పోలీసుల ఛేజ్ లో ఎస్కేప్ అవుతాడు. దాంతో చనిపోయిన ఆ ఐదుగురి బంధువులు (ఐదుగురు ఆడవాళ్లు) ఒకటవుతారు. క్రైమ్ నవల్లు రాసే పెన్సిల్ పార్దసారధిని(నాని) కలుస్తారు.హాలీవుడ్ సినిమాలు చూస్తూ నవల్లు రాసే అతని అసలు ట్యాలెంట్ గురించి తెలియక…అతని సాయంతో తమ డబ్బు పట్టుకుని పారిపోయిన ఆ మోసగాడి(కార్తికేయ)ని ఎలా వెతికి పట్టుకున్నారు? చివరికి పగ తీర్చుకున్నారా ? అన్నదే సినిమా కథాంశం.
టాక్ ఏంటి
ఈ సినిమా ఫస్టాఫ్ ఓకే అన్నట్లుగా నడిచింది. ఎక్సపెక్ట్ చేసినంత గొప్పగా ఏమీ లేదు. సెకండాఫ్ సైతం అదే స్దాయిలో డ్రాప్ అయ్యింది. ఎక్కువ ప్రెడిక్టుబుల్ సీన్స్ ఉండటం సినిమాకు మైనస్ గా మారింది. సినిమాలో పెద్దగా లాజిక్, స్క్రీన్ ప్లే మ్యాజిక్ లేదంటున్నారు. చిన్న చిన్న ట్విస్ట్ లు అక్కడక్కడా బాగానే పేలాయి. చివరి ఇరవై నిముషాలు ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది అంటున్నారు.ఉన్నంతలో అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
ఓవరాల్ గా నానినే ఈ సినిమాని మొత్తం మోసాడు. స్టోరీ,దర్శకత్వం అతనికేమీ కలిసి రాలేదు. కార్తికేయ మాత్రం నెగిటివ్ రోల్ బాగా చేసాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ నీట్ గా ఉన్నాయి. మల్టిఫ్లెక్స్ ల దగ్గర వర్కవుట్ అయ్యే ఈ సినిమా ఏ మేరకు భాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో చూడాలి అంటున్నారు. అయితే ఇదంతా కేవలం టాక్ మాత్రమే. ఖచ్చితమైన రివ్యూ మరికొద్దిసేపట్లో ఇదే సైట్ లో చూడచ్చు.