‘గ్యాంగ్ లీడర్’ ఫైనల్ కలెక్షన్స్..షాక్ లో నాని

‘గ్యాంగ్ లీడర్’ బిజినెస్ క్లోజ్, రిజల్ట్ ఏంటంటే

‘కృష్ణార్జున యుద్ధం’, ‘దేవదాసు’ వంటి రెండు డిజాస్టర్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని … ‘జెర్సీ’ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో నాని నటన అద్భుతంగా ఉందని అభిమానులు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత నాని త్వరలో ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కి,రిలీజైంది. దాదాపు అన్ని సెంటర్లలోనూ ఈ సినిమా రన్ పూర్తైంది. ఈ నేపధ్యంలో సినిమా హిట్టా, యావరేజా, లేక ప్లాఫా అన్నది ట్రేడ్ వర్గాలు తేల్చాయి.

వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ రోజే డివైడ్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు నాని క్రేజ్, ట్రైలర్ లో ఫన్ వర్క్‌అవుట్ అయ్యి ఆ సినిమా బాగుందనిపించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ఆ సినిమాని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కూడా హమ్మయ్య అనుకుంది. ఆ వీకెండ్ లో మూడు రోజులు కూడా చాలా డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేసింది నానీస్ గ్యాంగ్ లీడర్. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా జారుకుంది.

నాలుగో రోజు నుండి కూడా భయంకరమయిన డ్రాప్ చూపించటంతో అంతా షాక్ అయ్యారు. ఒక యావరేజ్ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కూడా ఆ తర్వాత నుంచీ నమోదు కాలేదు. దాంతో 11 రోజుల పూర్తయ్యే సరికి ఈ సినిమా కేవలం 15 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి, డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు మిగిల్చింది. నాని గత చిత్రం జెర్సీ 21 కోట్లు వసూలు చెయ్యగా, గ్యాంగ్ లీడర్ ఆ సినిమా కన్నా ఐదు కోట్లు తక్కువే వసూలు చేసి షాక్ ఇచ్చింది. దాంతో మినిమం యావరేజ్ అవుతున్న సినిమా ఇంత దారుణంగా దెబ్బతినటంతో షాక్ లో ఉండిపోయారట.

ఏరియా.. షేర్(కోట్లలో)

నైజాం – 6.10
సీడెడ్ – 1.92
ఉత్తరాంథ్ర – 2.06
గుంటూరు – 1.21
ఈస్ట్ గోదావరి- 1.25
వెస్ట్ గోదావరి – 0.93
కృష్ణా – 1.15
నెల్లూరు – 0.50
మొత్తం ఆంధ్రా, తెలంగాణా కలెక్షన్స్ : 15+ కోట్లు