టాలీవుడ్‌లో వున్న మినిమమ్ గ్యారెంటీ హీరో నేచురల్ స్టార్ నాని. ఈ హీరో ప్రస్తుతం కష్టాల్లో వున్నాడు. ఇటీవల `జెర్సీ` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్నా ఆ తరువాత వచ్చిన `గ్యాంగ్ లీడర్` ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. హీరోగా చేతినిండా సినిమాలున్నా నిర్మాతగా మాత్రం నాని ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పడం లేదని తెలిసింది.
నాని నిర్మాతగా మారి వాల్ పోస్టర్ సినిమా బ్యాపర్‌పై ఇప్పటికి రెండు చిత్రాల్ని నిర్మించాడు. అందులో ఒకటి ప్రశంత్ వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ `అ!`. రెండవది విశ్వక్‌సేన్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `హిట్`. ఈ రెండు చిత్రాలు నిర్మాతగా నానికి మంచి పేరునే తెచ్చిపెట్టాయి కానీ అదే స్థాయిలో కొత్త ప్రాబ్లమ్‌ని కూడా క్రియేట్ చేశాయి.
ఈ రెండు చిత్రాల శాటిలైట్ రైట్స్ ఇప్పుడు నానికి గుదిబండగా మారాయి. `అ!` రిలీజై రెండేళ్లు పూన్తయినా ఇప్పటికీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ని నాని అమ్మలేకపోయాడు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని `హిట్` సినిమా ఎదుర్కొంటోంది. `హిట్` అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయినా శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంకా హోల్డ్‌లోనే పెట్టడంతో నానికి కష్టాలు తప్పడం లేదట.