2003లో వచ్చిన `ఒక్కడు` సినిమాలో అదే కొండారెడ్డి బురుజు సెంటర్ అదే ప్రకాశ్ రాజ్. మళ్ళీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత కూడా తెరమీద వీళ్ల కాంబినేషన్ సేమ్ లొకేషన్స్‌లో కనిపిస్తున్నా కూడా థియేటర్లో సీన్స్‌కి విజిల్స్ పడుతున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే సీన్ అదిరింది. రాయలసీమ యాసలో ప్రకాశ్‌రాజ్ పవర్ఫుల్ విలనిజం డైలాగులు బాగున్నాయి. నిరాహార దీక్ష చేసే వ్యక్తిని బెదిరిస్తున్న నేపధ్యంలో కత్తితో పొడిపించుకున్నవాడు ఇంటికెళ్లి పడుకుంటాడు. పొడిపించుకున్న వాడికి ఇంట్లో పెళ్లాం ఉంటుంది. పిల్లలు ఉంటారు. పోటు మహాసేటు అయితాది రెడ్డి అని నిరాహార దీక్ష చేసే వ్యక్తిని బెదిరిస్తాడు ఏదేమైనా ఒక్కడు కొండారెడ్డి బురుజు సీన్ మళ్లీ ఇంట్రస్టింగ్‌గా రిపీట్ అయ్యింది.
ఇకరకంగా చెప్పాలంటే మహేష్‌కి, ప్రకాష్‌రాజ్‌కి ఈ సీన్ సెంటిమెంట్‌గా వర్క్ అవుట్ అయినట్లు అనిపించింది. కొండారెడ్డి బురుజు అనేది చిత్రంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని ఇటీవలె మహేష్‌ను ఇంటర్వ్యూలో భాగంగా అడగగా… అది కథలోని సీన్కోసమే తప్పించి కావాలని పెట్టింది ఏమీ లేదని అక్కడ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక్కడు చిత్రం గుర్తువచ్చి ఆయన కూడా చాలా ఆనందపడినట్లు తెలిపారు. ఒక్కడు చిత్రం మహేష్ కెరియర్‌కి ఓ మైలురాయి లాంటిది. అప్పట్లో ఆ చిత్రం మహేష్ కి ఓ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. రాయలసీమలో ఓ మంచి సెంటర్లో విలనిజం చూపించే సీన్లు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కొండారెడ్డి బురుజు సెంటరే అని చెప్పాలి. సినిమావాళ్లకి చాలా సెంటిమెంట్లు ఉన్నట్లు ప్లేస్‌లు కూడా వాళ్ళకి ఒకరకంగా సెంటిమెంట్ అనే చెప్పాలి. కానీ ఇది ఈ సినిమాకి సెంటిమెంట్ ప్లేస్ కాకపోయినా కలిసొస్తే మాత్రం సెంటిమెంట్ అనే ఫీలవుతారు. ఇక దర్శకుడు అనిల్ మొదటి సారి కామెడీతో పాటు మంచి ఫ్యాక్షనిజం ఉన్న కథను కూడా టచ్ చేసినట్లు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడుకున్న చిత్రమని అర్ధమవుతుంది. ఇక మరి ఈ చిత్రం పూర్తయ్యే సరికి ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడాలి.