క‌రోనా..! శ్రావ‌ణ మాసం వ‌ర‌కూ ఆగాలి బావ‌లూ!!

క‌రోనా..! శ్రావ‌ణ మాసం వ‌ర‌కూ ఆగాలి బావ‌లూ!!

యంగ్ హీరోలు నితిన్.. నిఖిల్ ఈ వేస‌విలో పెళ్లి బంధంతో ఓ ఇంటివాళ్లు అవ్వాల‌ని కోటి ఆశ‌ల‌తో ఎదురు చూస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ‌ను ముదురు బ్యాచిల‌ర్స్ అన్న వాళ్ల‌కు స‌రైన‌ స‌మాధాన‌మివ్వాల‌ని ఆస‌క్తిగానే వేచి చూశారు. ఎన్నో ఏళ్ల ఆత్ర‌మిది. వెయిటింగ్ వెయిటింగ్.. ఇంత‌లోనే మాయ‌దారి క‌రోనా!! ఆల్ లాక్ డౌన్… ఇప్పుడెలా..? పెళ్లాడేదెలా?

ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడేస్తే ఓ పనై పోతుంద‌ని…అటుపై ఎంచ‌క్కా తీరిగ్గా హ‌నీమూన్ కి విదేశాలు చెక్కేయొచ్చ‌ని ప్లాన్ చేసుకున్నారు. ఈలోపు వేస‌వి పూర్త‌యి..చ‌ల్ల‌ద‌నంలోకి ఎంట‌రైపోతాం కాబ‌ట్టి… అనంత‌రం మ‌ళ్లీ బిజీ లైఫ్ లోకి వ‌చ్చినా న‌ష్ట‌మేమీ లేద‌ని భావించారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని క‌ల్లోలం. ప్ర‌పంచ యుద్ధాన్ని మించిన ప్ర‌హ‌స‌నం.. ఒక్కసారిగా కొవిడ్ 19 వైర‌స్ విజృంభ‌ణ ఆ ఇద్ద‌రి పాలిట పెద్ద శ‌త్రువైంది. చివ‌రికి మ‌నిషికి మ‌నిషే శ‌త్రువుగా మారిపోవ‌డంతో పెళ్లి స‌హా అన్ని ప‌నుల్ని వాయిదా వేసుకోవాల్సి వ‌చ్చింది.

ఈ యంగ్ హీరోలిద్ద‌రు ఎంగేజ్ మెంట్ తంతు ముగించ‌గానే క‌రోనా చాప కింద నీరులా భార‌త్ లో వ్యాపించ‌డంతో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు మ్యారేజ్ ని వాయిదా వేసుకున్నారు. ఓ ర‌కంగా చెప్పాలంటే నితిన్ చాలా చాలా ల‌క్కీ. డెస్టినేష‌న్ వెడ్డింగ్ ని దుబాయ్ లో ప్లాన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 16న పెళ్లి తంతు ముగించాల‌నుకున్నారు. క‌రోనా అంత‌కు ముందే కోర‌లు చాచింది కాబ‌ట్టి ఆ ముప్పు నుంచి త‌ప్పించుకోగ‌లిగారు. ప్ర‌స్తుతం దుబాయ్ లో ప‌రిస్థితి ఎలా ఉందో తెలిసిందే. మ‌రి ఈ ఇద్ద‌రు హీరోలు పెళ్లి కోసం ఇంకెతం కాలం ఆగాల్సి ఉంటుంది? అంటే? శ్రావ‌ణ మాస‌మో! కార్తీక మాస‌మో!! వ‌చ్చే వ‌ర‌కూ వెయిట్ చేయ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

లాక్ డౌన్ ఏప్రిల్ 14 వ‌ర‌కూ ఉంది. క‌రోనా విజృంభ‌ణ ఇలాగే ఉంటే మే వ‌ర‌కూ కొన‌సాగింపు త‌ప్ప‌ద‌ని ఇప్ప‌టికే నిపుణులు చెబుతున్నారు. ఆ త‌ర్వాత ప‌రిస్థితి ఇలాగే ఉంటే ద‌శ‌ల‌వారిగా కొంత సండ‌లింపు ఇచ్చి యాథావిథిగా లాక్ డౌన్ జూన్ వ‌ర‌కూ కొన‌సాగించే ఛాన్సెస్ ఉన్నాయ‌ని చెబుతున్నారు. అంటే అప్ప‌టికి జూలై నెలాఖ‌రుకు శ్రావ‌ణ మాసంలోకి ఎంట‌ర్ పోతాం. అప్ప‌టి నుంచి స‌రిగ్గా నెల రోజుల శ్రావ‌ణ మాసం పూజ‌లు జ‌రుగుతాయి. పెళ్లిళ్ల‌కు ఆ నెల ఎంతో మంచింది. ఒక వేళ అదీ త‌ప్పితే అంత‌కు మించిన బ‌ల‌మైన ముహూర్తాలు దొర‌కాలంటే కార్తీక‌మాసం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా రియ‌ల్ లైఫ్ లో పెళ్లి కొడుకులు అవ్వాల‌ని ఎంత త‌హ‌త‌హ‌లాడారో? మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు అంత‌కంత‌కు ఆ ఘ‌డియ‌లు వెన‌క్కి పోతున్నాయి. ఇది కేవ‌లం నిఖిల్ – నితిన్ ప‌రిస్థితే కాదు.. ఊళ్లో పెళ్లికొడుకుల అంద‌రి ప‌రిస్థితి ఇలానే ఉంది మ‌రి. ఇలాంటి స‌న్నివేశం ఎవ‌రికీ రాకూడ‌దు సుమా!