కరోనా సినిమా ఇండస్ట్రీని చావు దెబ్బ కొట్టింది. మార్చిలో రిలీజ్ కావాల్సిన సినిమాలపై దీని ప్రభావం అవం అంతా ఇంతా కాదు. మార్చి నెల 25న రిలీజ్‌కు చాలా చిన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ప్రదీప్ సినిమా `30 రోజుల్లో ప్రేమించడం ఎలా?`, కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన `అమృతా రామమ్`.. నాని, సుధీర్ హీరోలుగా దిల్ రాజు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ `వి`.. ఇవే కాకుండా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న `రెడ్`. నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా`..
ఇలా ఓ మోస్తరు చిత్రాల నుంచి చిన్న చిత్రాల వరకు చాలా చిత్రాలు మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. అనూహ్యంగా కరోనా విజృంభించడంతో ఈ చిత్రాలకు గట్టి దెబ్బ తగిలింది. ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు.. దీనికేంటి పరిష్కారమో తెలియదు. ఒక వేళ కరోనా రెండు మూడు నెలల తరువాత కట్టడి అయినా సినిమాల రిలీజ్‌లకు, షూటింగ్‌లకు అనుమతిచ్చే అవకాశం కనిపించడం లేదు.
దీంతో ఇక లాభం లేదని, మరి కొంత కాలం వేచి చూడటం వల్ల ఇంట్రెస్ట్‌లు పెరుగుతాయే కానీ ఎలాంటి లాభం వుండదని గ్రహించిన వారంతా ఓటీటీలని నమ్ముకుంటున్నారు. తమ సినిమాలని అమ్ముకుంటున్నారు. తాజాగా `అమృతారామమ్` చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే బాటలో మరిన్ని చిత్రాల్ని రిలీజ్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి.