సమాజ హితం కోసం స్టార్ డైరెక్టర్ ఎవరూ చేయని త్యాగానికి సిద్ధపడటం ఆసక్తికరంగా మారింది. ఆ దర్శకుడు మరెవరో కాదు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ. ఆయనకు అభ్యుదయ భావాలు ఎక్కువే. రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి సాధారణ రచయితగా ఎంట్రీ ఇచ్చిన కొరటాల మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి కేవలం నాలుగు చిత్రాలతో స్టార్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయారు.
నిత్యం సమాజం గురించి ఆలోచిస్తూ తన సినిమాల్లోనూ అదే భావజాలాన్ని ప్రతిబింబించే కథల్ని ఎంచుకుంటూ కమర్షయల్ చిత్రాల్లోనూ మావో సిద్ధాందాన్ని అంతర్లీనంగా చూపిస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కిస్తున్న ఐదవ చిత్రం `ఆచార్య`. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తను ఎక్కడ పిల్లల్ని కంటే సమాజ సేవకి ఎక్కడ దూరమైపోతానో అన్న భావనతో పిల్లలే వద్దనుకున్నారట. అతన నిర్ణయానికి కొరటాల భార్య కూడా మద్దతు తెలపడం నిజంగా అభినందనీయమని, ఇలాంటి రేర్ క్వాలిటీస్ వున్న దర్శకుడు కొరటాల అని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.