కొరటాల స్క్రిప్టులో చిరు చెప్పిన ఛేంజెస్ ఇవే

 
కొరటాలకు చిరంజీవి లాస్ట్ మినిస్ట్ సజెషన్స్

‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యాన్స్ కు దసరా కానుక ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన 152వ సినిమా షురూ చేసారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఓ ఆసక్తికరమైన విషయం బయిటకు వచ్చింది.

స్క్రిప్టు మొత్తం విన్న చిరంజీవి…దర్శకుడు కొరటాల శివను పిలిచి సినిమాలో డ్రామా తగ్గించమని,అలాగే మాస్ ఎలిమెంట్స్ పెంచుతూ…లైట్ హార్డెడ్ సీన్స్ అక్కడక్కడా కూర్చమని చెప్పారట. తన అభిమానులు తన నుంచి ఆశించే అంశాలైన ఫన్, డాన్స్ లు తన సైరా చిత్రంలో మిస్సయ్యాయని , వాటిని ఈ సోషల్ డ్రామాలో పెట్టడం మంచిదని సూచించారట. అలాగే ఫైట్స్ కూడా స్పెషల్ గా డిజైన్ చెయ్యమని, సోషల్ మెసేజ్ సినిమాగా కాకుండా ఓ కమర్షియల్ వెంచర్ డీల్ చేస్తున్నట్లే చేయమని అన్నారట. దాంతో షూటింగ్ మొదలయ్యేలోగా కొరటాల శివ ..స్క్రిప్టుకు రిపేర్ల్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రం కోసం ఆర్ ఎఫ్ సి లో ఓ ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారు.

ఇక స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీసిన ‘సైరా’ అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ సాధించింది. అంతేకాదు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు పొందింది. బాక్సాఫీసు వద్ద రెండు రోజుల్లో రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ‘సైరా’ చిరంజీవి 12 ఏళ్ల కల కావడం విశేషం. ఇన్నేళ్ల తర్వాత ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించి.. తండ్రి కలను సాకారం చేశారు. సురేందర్‌ రెడ్డి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించారు.