కమల్ ‘భారతీయుడు 2 ‘ లో వెన్నెల కిషోర్

హాస్య నటుడిగా కెరీర్ ఆరంభించిన వెన్నెల కిషోర్ ఎవరూ ఊహించిన విధంగా కొద్దీ కాలంలోనే ఉత్తమ స్థాయికి ఎదిగాడు. తన కామెడీ టైమింగ్ తో కమెడియన్ గానే కాదు సినిమాలో తన కంటూ ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేసేంత వరకు ఎదిగాడు. ఆ పైన ఇప్పుడు దర్శకులే అతని కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసే స్థాయిలో ఉన్నదంటే అతిశయోక్తి కాదు.

కిషోర్ ప్రతిభ చూసి ఆయనకు దర్శకుడు శంకర్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. కమల్ భారతీయుడు 2 లో ఆయనకు ఒక ముఖ్య పాత్ర ఇచ్చినట్టు సమాచారం. మరి శంకర్ సినిమాలో తమిళ కమెడియన్లను కాదని కిషోర్ కు ఎలాంటి పాత్ర దక్కిందో తెలియాలంటే వేచి చూడాల్సిందే