‘కండోమ్ ఫ్యాక్టరీ’కు చిరు ఒప్పుకున్నాడా?

కళ్యాణ్ దేవ్ ‘కండోమ్ ఫ్యాక్టరీ’?

ఇప్పుడు హీరోలంతా ఏదైనా వెరైటీ స్టోరీలైన్ , టైటిల్ ఉంటేనే సినిమాలు కమిటవ్వుతున్నారు. లేకపోతే మార్కెట్లో బజ్ క్రియేట్ చేయటం కష్టమని భావిస్తున్నారు. అయితే ఏ బ్యాక్ గ్రౌండ్ లేని కొత్త హీరోలు అయితే ఏ టైటిల్ పెట్టినా, ఏ కథ రాసుకున్నా ఇబ్బంది లేదు. కానీ మెగా క్యాంప్ వచ్చే హీరోలకు వెనకాల పెద్ద బ్యాక్ గ్రౌండ్,కుటుంబం ఉంటుంది. ప్రతీ విషయం చిరంజీవితో లింక్ అప్ అయ్యి ఉంటుంది. కాబట్టి మెగా కుటుంబానికి చెందిన హీరోలంతా చాలా జాగ్రత్తాగ ఉంటారు.

ఈ నేపధ్యంలో తాజాగా ఓ వార్త మెగాభిమానులను కంగారుపెడుతోంది. అదేమిటంటే మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ తాజాగా ఓ సినిమా కమిటయ్యారట. అదో పీరియడ్ సినిమా అని, 1980కాలంలో జరుగుతుందని టాక్. ఆ సినిమా టైటిల్ కండోమ్ ఫ్యాక్టరీ అంటున్నారు. అంతేకాదు కథ ప్రకారం హీరో ఓ కండోమ్ ఫ్యాక్టరీలో పని చేస్తాడని చెప్తున్నారు. అయితే ఇలాంటి టైటిల్ తో నిజంగా సినిమా పట్టుకొచ్చినా కళ్యాణ్ దేవ్ ఓకే చేస్తాడా..ఆయన ఒప్పుకున్నా చిరంజీవి ఒప్పుకుంటాడా అనేది గమనించదగ్గ విషయం.

ఇక కళ్యాణ్ దేవ్ విషయానికి వస్తే ఆయన తొలి చిత్రం విజేత డిజాస్టర్ కావటంతో ఆచి,తూచి అడుగు వెయ్యాలని ఓ సినిమా ప్రారంభించాడు. అయితే ఆ సినిమా కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆపేసారు. కథ బాగోలేదని, బడ్జెట్ ఇబ్బందలని రకరకాలు కారణాలు వినిపించాయి. ఏదైతేనేం ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మరో సినిమా ప్రారంభం అవ్వాలి. అదే ఈ సినిమానా అనేదే ఇప్పుడు ఫిల్మ్ నగర్ జనాలను తొలుస్తున్న సమస్య.