ఐటెం భామకు శేఖర్ కమ్ముల ఛాన్స్?

పేరుకు హీరోయినే. ఆమె గత రెండేళ్లలో రెండు తెలుగు సినిమాలు చేసింది అయినా ప్రేక్షకులు ఆమెను గుర్తించ లేదు. ఆమె డింపుల్ హయాతి. 2017లో ‘గల్ఫ్’ ఆ పైన ‘యురేకా’ చేసింది కానీ ఫలితం లేదు. తాజాగా వరుణ్‌తేజ్ ‘వాల్మీకి’లో జర్ర జర్ర అంటూ చేసిన మాస్ సాంగ్‌లో హయతి మెరుపులు మెరిపించింది.

ఇది చూసే కన్నడ సినిమాకు అవకాశం వచ్చిందట. ఇటు తెలుగులోనూ శేఖర్ కమ్ముల దృష్టిలో పడినట్టు వార్తలొస్తున్నాయి.శేఖర్ కమ్ముల -డింపుల్‌ను ఎంత ఎత్తుకు తీసుకెళ్తాడోనన్న చర్చా లేకపోలేదు. మరి డింపుల్ హయతి దశ ఎలా తిరగనుందో చూద్దాం