‘ఉయ్యాలవాడ’ ఫ్యామిలీకి సాయం చేయనన్న రామ్ చరణ్

‘సైరా’వివాదం పై మాట్లాడిన రామ్ చరణ్

‘సైరా’ సినిమా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు నుండి సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘సైరా’ నిర్మాత రామ్ చరణ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మా ర‌క్తం, మా బంధంతో కొణిదెల ప్రొడక్షన్స్ కోట్ల రూపాయ‌ల బిజినెస్ చేస్తుందని రామ్‌చ‌ర‌ణ్ ఆఫీస్ ముందు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌ చేశారు.

‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని వారు ఆరోపించారు. అప్పట్లో తమను ఆదుకుంటామని రామ్ చరణ్ అప్పుడు హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక సాయం అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై మొత్తానికి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చారు.

రామ్ చరణ్‌ మాట్లాడుతూ… ఆయన కుటుంబ సభ్యుల్ని నేను కూడా కలిశాను. ఓ వ్యక్తి జీవితం గురించి తీసుకున్నప్పుడు.. 100 ఏళ్ల తర్వాత అది చరిత్ర అవుతుంది. ఇదంతా మీకు తెలుసు. సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. వందేళ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్ర అవుతుంది. దాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, బాధ్యతాయుతంగా సినిమాగా తీయొచ్చని చెప్పింది.

ఇంకా చెప్పాలంటే ఇటీవల మంగళ్ పాండే అనే గ్రేట్ లీడర్‌పై సినిమా తీసేటప్పుడు కూడా ఇలాంటి వివాదామే నడిచింది. ఆ సందర్భంలో 100 సంవత్సరాలు కాదు.. 65 సంవత్సరాలకే ఇలాంటి వ్యక్తులు జీవితాలను సినిమాగా తీయొచ్చని చెప్పారు. అని అన్నారు.

అయినా నరసింహారెడ్డిని ఓ కుటుంబానికి, ప్రాంతానికి పరిమితం చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన దేశం కోసం పనిచేశారు. ఆయన స్థాయిని నేను ఎప్పటికీ తగ్గించను. ఆయన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఉయ్యాలవాడ అనే ఊరి కోసం నిలబడ్డారు. నేను రేపటి రోజున ఏదైనా చేయాలని అనుకుంటే.. ఆ ఊరికోసం చేస్తాను.. ఆ జనం కోసం చేస్తాను తప్ప.. ఒక కుటుంబానికి లేదా నలుగురి వ్యక్తుల కోసం నేను చేయను అని తేల్చి చెప్పారు.