ఇస్మార్ట్ అక్క‌డా ఇర‌గ‌దీస్తున్నాడు

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ న‌టించిన చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు. బాక్సీఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని ఛార్మీతో క‌లిసి పూరిజ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్ప‌టి వ‌ర‌కు క్లాస్ పాత్రల్లో సాఫ్ట్‌గా ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపించిన రామ్ ఒక్క‌సారిగా మాస్ అవ‌తారంలోకి మారిపోయారు.

గెట‌ప్ ద‌గ్గ‌రి నుంచి హెయిర్ స్టైల్‌, డైలాగ్ డిక్ష‌న్ వ‌ర‌కు అన్ని విష‌యాల్లోనూ కొత్త‌గా హీరో రామ్‌ని ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన తీరు ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. రామ్ తొలిసారి ఊర‌మాస్ గెట‌ప్‌లో న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డ‌మే కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని అందించింది. న‌భా న‌టేష్‌, నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్ర హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

రామ్ కెరీర్‌లోనే 40 కోట్ల షేర్‌ని సాధించిన ఈ చిత్రం ‌తిరుగు లేని విజ‌యాన్ని అందించింది. ఈ చిత్ర హిందీ వెర్ష‌న్ యూట్యూబ్‌లో అనూహ్యంగా 100 మిలియ‌న్‌ల వ్యూస్‌ని దాట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ఏడాది ఫ‌బ్ర‌వ‌రిలో ఈ చిత్ర హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ రోజు వ‌ర‌కు వంద మిలియ‌న్ వ్యూస్ దాటింది.