ఇన్నేళ్ల‌కు అస‌లు పేరుతో న‌టిస్తున్నాడు!

సామాన్యులు సైతం విమానాల్లో తిర‌గాల‌ని క‌ల‌లు క‌న్న వ్య‌క్తి ఏయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ జి.ఆర్ గోపీనాథ్‌. ఆయ‌న జీవిత క‌థ స్ఫూర్తితో వ‌స్తున్న చిత్రం `సూర‌రాయి పోట్రు`. సూర్య హీరోగా న‌టిస్తూ 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గునీత్ మెంగాతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోంది. తెలుగులో `ఆకాశ‌మే నీహ‌ద్దురా` పేరుతో రిలీజ్ కాబోతోంది.

ఇందులో సూర్య పాత్ర అత్యంత స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా వుండ‌బోతోంది. అప‌ర్ణా బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. సూర్య‌కు గురువుగా, సీనియ‌ర్ ఏయిర్ ఫోర్స్ అధికారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇందులో చిత్రం ఏంటంటే మోహ‌న్‌బాబు పాత్ర పేరు భ‌క్త‌వ‌త్స‌లం నాయుడు. ఇది ఆయ‌న అస‌లు పేరు. కెరీర్ తొలి నాళ్ల‌లో ఆయ‌న పేరుని దాస‌రి నారాయ‌ణరావు మోహ‌న్‌బాబుగా మార్చారు. చాలా ఏళ్ల త‌రువాత మోహ‌న్‌బాబు త‌న అస‌లు పేరుతో న‌టిస్తున్న చిత్రం కావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తాజాగా మోహ‌న్‌బాబు లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర పేరుని కూడా వెల్ల‌డించారు. ఇటీవ‌ల `మ‌హాన‌టి`లో ఎస్వీరంగారావుగా న‌టించిన మోహ‌న్‌బాబు పాత్ర న‌చ్చ‌డంతో తమిళ వెర్ష‌న్‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నార‌ట‌. ఏప్రిల్ 9న ఈ చిత్రం రెండు భాష‌ల్లోనూ ఒకేసారి విడుద‌ల కానుంది.