ఇంగ్లీష్ టైటిల్‌తో అఖిల్ అక్కినేని సినిమా!

ఈ మ‌ధ్య తెలుగులో ఇంగ్లీష్ టైటిల్ మేనియా న‌డుస్తోంది. తెలుగు టైటిల్ అయినా స‌రే ఇంగ్లీష్‌లో వుండాల్సిందే. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `అర్జున్‌రెడ్డి` సినిమా నుంచి ఈ తంతు టాలీవుడ్‌లో మొద‌లైంది. ఏబీసీడీ, ఎఫ్‌2, ఓ బేబీ, నాని జెర్సీ, ఇస్మార్ట్ శంక‌ర్‌, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, కీర్తి సురేష్ మిస్ ఇండియా.. రామ్ రెడ్‌.. ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ గోల మ‌రీ ఎక్కువైపోయింది.

తాజాగా ఈ జాబితాలో మ‌రో యంగ్ హీరో సినిమా చేర‌బోతోంది. అక్కినేని అఖిల్ గీతా ఆర్ట్స్‌2 బ్యాన‌ర్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా జ‌రిగిపోతోంది. ఈ చిత్రానికి `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేయాల‌నుకుంటున్నారు. మొద‌ట్లో ఈటైటిల్ జ‌నాల‌కి ఎక్కుతుందా? అని అనుమానించారు. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రానికి `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` అని పెట్ట‌డం, దాన్నిప్రేక్ష‌కులు అంగీక‌రించ‌డంతో ముందు అనుకున్న టైటిల్‌నే ఈ నెల 4న ప్ర‌క‌టించ‌బోతున్నారు. మ‌రి ఈ సినిమా అయినా అఖిల్‌కి హిట్టిస్తుందో లేదో చూడాలి.