ఆ ఇద్ద‌రు హీరోలపైనా ఈ టైమ్ లో బిగ్ పంచ్!

ఆ ఇద్ద‌రు హీరోలపైనా ఈ టైమ్ లో బిగ్ పంచ్!

టైమ్ బావుండ‌క‌పోతే ఎంత‌టి వారైనా దిగి రావాల్సిందే. సరిగ్గా టైమ్ బావుంది.. కాలం క‌లిసొస్తోంది! ఇక‌పై టేకాఫ్ అవ్వ‌డ‌మే అనుకుంటున్న వేళ ఆ ఇద్ద‌రు హీరోల‌పైనా క‌రోనా రూపంలో పెద్ద పంచ్ ప‌డింద‌ని విశ్లేషిస్తున్నారు. అస‌లే హిట్లు లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న ఆ ఇద్ద‌రూ దాదాపు ప‌దిహేనేళ్లుగా సినీకెరీర్ కోసం ఎంతో పాకులాడుతూనే ఉన్నారు. స‌రిగ్గా ఇలాంటి వేళ కొన్ని వ‌రుస డిజాస్ట‌ర్ల త‌ర్వాత 2019 ఆ ఇద్ద‌రికీ క‌లిసొచ్చింది. కెరీర్ లో ఆశించిన హిట్టు ద‌క్కడంతో హుషారు పెరిగింది.

ఇక కెరీర్ ని ప‌రుగులు పెట్టించ‌డ‌మే అనుకుంటుండ‌గా.. ఉన్న‌ట్టుండి క‌రోనా పిడుగు పాటులా మీద ప‌డింది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్ని కానీ.. లేదా సెట్స్ కెళ్లాల్సిన వాటి విష‌యంలో కానీ ఇక ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొందిట‌. స‌రిగ్గా కెరీర్ ని కాచుకోవాల్సిన టైమ్ లో క‌రోనా కాటేసింద‌న్న ఆవేద‌న ఆ ఇద్ద‌రిలో వ్య‌క్త‌మ‌వుతోందిట‌. అస‌లే త‌మ ఫ్యామిలీలో పెద్ద‌న్న హీరో గ‌త రెండేళ్లుగా స‌రైన హిట్టు లేక నానా తంటాలు ప‌డుతున్నాడు. ఇక పెద్దాయ‌న‌ వార‌సుల్లో పెద్దోడి కెరీర్ బావున్నా.. చి‌న్నోడి కెరీర్ హిట్టు అన్న‌దే లేక‌పోవ‌డంతో డైల‌మాలో ప‌డింది. దీనిపై స‌ద‌రు అగ్ర హీరో ఎంతో ఇదైపోతున్నాడు. ఫ్యామిలీ నుంచి ఐదారుగురు స్టార్లు ఉన్నా రాణించేది లేక‌పోవ‌డం ఊపిరాడ‌నివ్వడం లేదు మ‌రి. ఈ స‌న్నివేశంలోనే క‌రోనా అద‌నంగా ఊపిరాడ‌నివ్వ‌కుండా న‌లిపేస్తోంది. సినిమా ప‌రిశ్ర‌మ‌కు మ‌రో ఏడాది పాటు ఇదే త‌ర‌హా గ‌డ్డు కాలం త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక లెగ‌సీని ముందుకు తీసుకెళ్లాల్సిన వార‌స హీరోల్ని ఒక ఇద్ద‌రిని మిన‌హాయిస్తే…. అంతంత మాత్ర‌మే అనుకున్న మిగిలిన‌ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి ఏమిటో అర్థం కాని స‌న్నివేశం ఉందిట‌. ఇది మ‌రీ ఇబ్బందిక‌రం. మ‌రి ఈ స‌న్నివేశాన్ని ఆ ఇద్ద‌రూ ఎలా ఎదురీది జ‌యిస్తారో చూడాలి.