ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

ఆ ఇద్ద‌రికి అనిల్ రావిపూడి షాకిస్తున్నాడా?

`ఎఫ్‌2` బ్లాక్ బ‌స్ట‌ర్ అంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌రు. సింపుల్ లైన్‌తో, జ‌బ‌ర్ద‌స్ట్ కామెడీ స్కిట్‌ల‌ని త‌ల‌పించే సీన్‌ల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇది సినిమానేనా? అని త‌న‌కు 15 నిమిషాలు చూడ‌గానే బుర్ర హీటెక్కిపోయింద‌ని హీరో విశ్వ‌క్‌సేన్ ఓపెన్‌గా చెప్పిన విష‌యం తెలిసిందే. ఎవ‌రు ఎలా ఫీలైనా విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌ని వంద కోట్ల క్ల‌బ్‌లో చేర్చిన చిత్ర‌మిది.

త్వ‌ర‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప‌నిలో వున్నాడు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మ‌హేష్‌తో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం వైజాగ్‌లో `ఎఫ్‌2` సీక్వెల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడు. అంతా క్వారెంటైన్ టైమ్‌ని వివిధ ప‌నుల‌కు ఉప‌యోగిస్తుంటే అనిల్ రావిపూడి మాత్రం సీక్వెల్ క‌థ‌ని సిద్ధం చేస్తున్నాడ‌ట‌.

ఈ సీక్వెల్‌లోనూ హీరోలుగా విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌నే ఫిక్స్ అయిన అనిల్ హీరోయిన్‌లని మార్చి షాకివ్వ‌బోతున్నాడ‌ట‌. ఇందులో త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్లుగా న‌టించారు. వారి స్థానంలో మ‌రింత గ్లామ‌ర్ గా వుండే క్రేజీ హీరోయిన్‌ల‌ని తీసుకోబోతున్నాడ‌ట‌. `ఎఫ్‌3` పేరుతో దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రాన్ని మే నుంచి ప్రారంభించాల‌ని ప్లాన్ సిద్ధ‌మైన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌.