టాలీవుడ్లో గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ `ఆహా` పేరుతో లోకల్ కంటెంట్ తో పాటు సినిమాల కోసం ప్రత్యేకంగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీగా మొదలుపెట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీలుక్‌ని లాంచ్ చేసి యాప్‌ని లాంఛనంగా మొదలుపెట్టిన అల్లు అరవింద్ దీని ప్రచారం కోసం ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండని రంగంలోకి దించేశాడు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్‌లో రౌడీ ఆహా హోర్డింగ్స్ని పెట్టించేశాడు.
తాజాగా ఆహా కోసం మరో స్టార్ హీరోయిన్ని కూడా ఎంటర్చేస్తున్నట్టు తెలిసింది. అక్కినేని వారి కోడలు సమంత కూడా ఆహా కోసం రంగంలోకి దిగుతోందని టాక్. ఆహా ఓటీటీ కోసం సమంతతో ప్రత్యేకంగా ఓ టాక్ షోని ప్లాన్ చేస్తున్నారట. హిందీ వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2` షూటింగ్ ని ఇటీవలే పూర్తి చేసకున్న సమంత తెలుగు, తో పాటు కొత్తగా తమిళ చిత్రాలకి ఓకే చెప్పాలనుకుంటోంది. ఈ సమయంలోనే ఆమెతో ఓ టాక్ షో చేసించాలని అల్లు అరవింద్ ప్లాన్ చేశారట. ఇందు కోసం భారీ స్థాయిలోనే పారితోషికంని అల్లు అరవింద్ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. సమంత వన్స్ ఆఫర్ ఓకే అంటే టాక్ షో షూట్ మొదలవుతుందని ఇన్ సైడ్ టాక్.