అబ‌ద్ధం అతికిన‌ట్లైనా ఉండాలి అమ్మ‌డు!

అబ‌ద్ధం అతికిన‌ట్లైనా ఉండాలి అమ్మ‌డు!

అబ‌ద్దం చెబితే క‌నీసం అతికిన‌ట్లైనా ఉండాలంటారు. అదీ చేత‌కాక‌పోతే నోటుకి తాళం వేసి సైలెంట్ గా ఉండాలి. అదీ చేత‌గాక‌పోతే ప్ర‌భుత్వం చెప్పింది చెప్పిన‌ట్లు వినాలి. లేదంటే ఇలాగే ఉంటుంది. ఇలాంటి ప్ర‌య‌త్న‌మే చేసి అడ్డంగా బుక్కైంది గూఢాచారి భామ శోభిత ధూళిపాళ‌. నేను ఇంట్లోనే ఉన్నాను…గ‌డ‌ప దాటకుంటానే అంద‌ల్ని కెమెరా బంధించాన‌ని పెద్ద  అబ‌ద్ధం ఆడి అడ్డంగా దొరికిపోయింది. లాక్ డౌన్ నేప‌థ్యంలో హీరోయిన్లు అంతా ఇంట్లో ఉంటూనే చేయాల్సిన వ‌న్నీ చేస్తున్నారు. శోభిత కూడా అలాగే ఇంటి మేడ‌పై సెల్ప్ టైమ‌ర్ తో త‌న‌కు తానే ఫోటోలు తీసుకున్నాని వాటిని సోష‌ల్ మీడియాకి ఎక్కించి కాక‌మ క‌బ‌ర్లు చెప్పింది.

కానీ కంగారులో త‌న‌కు ఎవ‌రైతే ఫోటోలు తీస్తున్నాడో? ఆ ఫోటో! మ‌ర్చిపోయి పోస్ట్ చేసింది. అమ్మ‌డు ఆ స్టిల్ ఫోటో గ్రాఫ‌ర్ కి ఎదురుగా నిల‌బ‌డి ఫోజులిస్తుండే అత‌గాడు ట‌పీ ట‌పీ మ‌ని క్లిక్ మ‌నిపిస్తున్నాడు. కానీ ఈ భామ మాత్రం త‌న‌కు తానే స్వ‌యంగా ఆ ఫోటోల‌ను తీసుకున్నాని క‌థ‌లు చెబుతోంది. సోష‌ల్ మీడియాలో నేటి జ‌నులు రెచ్చిపోవ‌డంతో ఓ కాక‌మ్మ క‌థ‌ను అల్లేసింది. త‌ను ఒక్క‌ర్తే ఫోటోలు తీసుకోవ‌డం చూసి ఇబ్బంది ప‌డుతుంటే ఆబాధ‌ను చూడ‌లేక ఒక వ్య‌క్తి త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఫోటోలు తీసాడ‌ని…ఇదంతా త‌న ఇంటి పై క‌ప్పు మీద జ‌రిగింద‌ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది.

అయితే ఇంకొంత మంది నేటి జ‌నులు శోభిత ఇలా కావాల‌నే చేసిందంటున్నారు. కేవ‌లం ఫోటోలు పెడితే ఎవ‌రు ప‌ట్టించుకుం టారు? ఎంత మంది హీరోయిన్లు ఇలాంటి ఫోటోలు పెట్ట‌లేదు? లాక్ డౌన్ వేళ ఇలాంటి సెన్షేష‌న్ ఏదైనా క్రియేట్ చేస్తే కొత్త‌గా ఉంటుంది? న‌లుగురిలోకి వెళ్ల‌డానికి ఓ ఆయుధంలా ఉంటుంద‌ని ఇలా ప్రీ ప్లాన్ డ్ గా చేసింద‌ని అంటున్నారు. అలాంటి ఆలోచ‌న లేక‌పోతే ముందుగానే ఆ వ్య‌క్తి గురించి ఓ క్యాప్ష‌న్ ఇచ్చేద‌ని అంటున్నారు. మరీ ఈ కామెంట్ల‌కు అమ్మ‌డు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.