పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `జానీ` చిత్రం విడుదలై ఈ నెల 25తో 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ చిత్రంపై పవన్‌కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఇదే రోజు 2003లో అత్యధిక ప్రింట్లతో(250) విడుదలై అప్పట్లో రికార్డు సృష్టించింది. ఈ సినిమా నుంచే సినిమాలో హీరో వాడిన వస్తువుల విక్రయం అనేది మొదలైంది. పవన్‌కల్యాణ్ నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్ర బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమాపై అప్పట్లో పవన్ స్పందించారు. నేను నటించి దర్శకత్వం వహించిన `జానీ` ఫ్లాప్ అయ్యింది. నిజం ఇప్పుకుని తీరాలి. సృజనాత్మక రంగంలో ఫెయిల్యూర్ అనేది సహజం. దానికి భయపడకూడదు. వునక్కి పోకూడదు. `జానీ` ఫ్లాప్ అయినప్పుడు అన్నయ్య నాతో ఒక మాట చెప్పారు. సరిగ్గా కష్టపడి వుంటే బాగుండేది` అని చెప్పారు. కష్టపడ్డాను కానీ సరైన దారిలో కష్టపడలేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. అయితే `జానీ` అవివేకంతోనో, జ్ఞానంతోనో తీసిన సినిమా కాదు. నాకు తెలిసి ఆ రోజు అనిపించిన మార్గంలో చేసిన సినిమా ఇది`అన్నారు.