హీరోగా మారనున్న బాలనటుడు తేజ

బాలనటుడు తేజ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ‘ఇంద్ర’ సినిమాలో చిన్న చిరంజీవి అంటే అందరికీ ఠక్కున గుర్తు వస్తాడు. ఇతను హీరోగా మారనున్నాడు. ప్రస్తుతం సమంత నటించిన ‘ఓహ్ బేబీ’ సినిమాలో సమంత మనుమడిగా నటించాడు. అంతే కాక దర్శకుడు ప్రశాంత్ వర్మ తో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ కుర్ర నటుడికి మరో అవకాశం కూడా చేతిలో ఉన్నట్టు సమాచారం