Home Tollywood హిట్ ఇచ్చినా హ‌రీష్ కు హీరో ఏడి? అందుకే ఈ డెసిషన్

హిట్ ఇచ్చినా హ‌రీష్ కు హీరో ఏడి? అందుకే ఈ డెసిషన్

హరీష్ శంకర్ కు ఏ హీరో డేట్స్ ఇచ్చాడు?

వరస ఫ్లాఫుల్లో దూసుకుపోతున్న దర్శకుడు హరీష్ శంకర్ కు కాస్త రిలీఫ్ వచ్చింది. ఆయన వాల్మీకి చిత్రంతో హిట్ కొట్టారు. ఈ చిత్రం కలెక్షన్స్ ఇప్పటిదాకా బ్రేక్ ఈవెన్ కు దగ్గరదాకా వచ్చాయి. మరికొద్ది రోజులు పాటు హవా సాగితే బయ్యర్లకు లాభాలు వస్తాయి. ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ ఇండస్ట్రీలో మరోసారి హాట్ డైరక్టర్ అయ్యారు. అయితే హరీష్ శంకర్ కు డేట్స్ ఇచ్చే హీరో ఎవరూ అంటే ఎవరూ సుదూర దూరంలో కనపడటం లేదు. అందరు హీరోలు పూర్తి బిజీగా ఉన్నారు. దాంతో హరీష్ శంకర్ కు వేరే ఆప్షన్ కనపడటం లేదు.

దాంతో తను హిట్ ఇచ్చిన వరుణ్ తేజ తోనే మరోసారి సినిమా చెయ్యాలనుకుంటున్నట్లు సమాచారం. పెద్ద హీరోల కోసం వెయిట్ చేసి సంవత్సరాలు తరబడి టైమ్ వేస్ట్ చేసుకుని మళ్లీ వెనక్కి వచ్చి ఏదో హీరోతో చెయ్యటం కంటే ఇదే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట. వరణ్ తేజతో మరో మాస్ సినిమా చెయ్యటానికి ప్లాన్ చేసుకుంటున్నారట. పాన్ ఇండియా సినిమా అనిపించుకునే చిత్రం వరుణ్ తో చేసి మిగతా హీరోలను తన వైపుకు తిప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు.

అయితే వరుణ్ తేజ వరస ప్రాజెక్టులలో బిజీగా ఉన్నాడు. వాటిని ఫినిష్ చేసుకుని హరీష్ శంకర్ దగ్గరకు రావాల్సి ఉంటుంది. అప్పటిదాకా స్క్రిప్టు మీద కూర్చుంటాడట హరీష్. ఈ మేరకు వరుణ్ తేజ దగ్గర మాట తీసుకుని ప్రొడ్యూసర్ ని సెట్ చేసుకుని ఆఫీస్ తీసుకుని స్క్రిప్టులో బిజీ అయ్యిపోతాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం సగంలో ఈ సినిమా ప్రారంభం అవుతుందంటున్నారు.

- Advertisement -

Related Posts

బన్నీ “పుష్ప” రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే ?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నాడు. తన పుష్ప సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించాడు. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. రష్మికా మందన్న...

ప్రభాస్ సరసన శృతిహాసన్ .. క్లారిటీ ఇచ్చిన సలార్ చిత్ర యూనిట్ !

లోకనాయకుడు కుమార్తె , స్టార్ హీరోయిన్ శృతిహాసన్ మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సరసన నటించిన శృతిహాసన్ తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే...

ఎవ్వరూ చూడని ఫోటో అడిగిన నెటిజన్.. అలా షాకిచ్చిన సురేఖా వాణి కూతురు

నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో ఎంత అల్లరి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. సురేఖా వాణి, సుప్రిత కలిసి వేసే టూర్లు, వీకెండ్‌లో చేసుకునే పార్టీలు సోషల్ మీడియాలో...

అందాల రాక్షసి.. పెదాలు కొరికిందా?

అందాల రాక్షసి అనగానే అందరికి గుర్తొచ్చే పేరు లావణ్య త్రిపాఠి. గత కొంత కాలంగా అమ్మడు పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. చివరగా చేసిన అర్జున్ సురవరం సినిమా పరవాలేధనిపించే విధంగా మెప్పించింది....

Latest News