దర్శక, హీరో రాఘవ లారెన్స్..బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సేవా దృక్ఫథం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు మనసులు దానంలో కర్ణుడి సమానులు. ఎలాంటి విపత్తులు వచ్చినా…సేవా కార్యక్రమాలు చేయాలన్న కోలీవుడ్ నుంచి లారెన్స్ ముందుం టే..బాలీవుడ్ నుంచి అక్షయ్ ముందుటాడు. నటులుగా కంటే గొప్ప దాతృ హృదయం గల వ్యక్తులుగా నిరూపించుకున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరు కలిసి లక్ష్మీ బాంబ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో విజయం సాధించిన కాంచనకు రీమేక్ రూపం ఇది. హిజ్రాల నేపథ్యంతో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రమది.
అందుకే హిజ్రాల కష్టాలను తెలసుకున్న కిలాడీ అక్షయ్ కోటిన్నర విరాళం ఇచ్చాడు. లారెన్స్–అక్షయ్ కలిసి హిజ్రాల కోసం సొంతంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి పూనుకున్నారు. దీనిలో భాగంగా అక్షయ్ కోటిన్నర విరాళం ఇచ్చాడు. ఆదివారం హిజ్రాలను కలిసి కోటిన్నర చెక్కును లారెన్స్ తో కలిసి అందించారు. హిజ్రాల నిర్మాణం కోసం కొటిన్నర విరాళం ఇచ్చిన ఏకైక బాలీవుడ్ స్టార్ అంటూ లారెన్స్ సంతోషం వ్యక్తం చేసాడు. ఇదే దేశంలో తొలిసారి అంటూ ప్రశంసించాడు. హిజ్రాల సమస్యను తానే అక్షయ్ దృష్టికి తీసుకెళ్లాననని అప్పుడే ఆయన స్పందించి కోటిన్నర ఇస్తానని మాటిచ్చారని..ఇప్పుడు మాట నిలబెట్టుకున్నారు. ఆ డబ్బుతో గొప్ప కార్యక్రమానికి పూనుకుంటున్నామని తెలిపాడు.
ఇక హిజ్రాల పట్ల సమాజంలో చాలా చిన్న చూపు ఉంది. మగ..ఆడ లక్షణలో పుట్టడం వాళ్లు చేసిన తప్పా? లేక దేవుడు చేసిన తప్పా? అని లారెన్స్ చాలాసార్లు తన సినిమాల ద్వారా చెప్పే ప్రయత్నం చేసాడు. దేవుడు అనే వాడు నిజంగా ఉంటే? మనుషులందర్నీ ఒకేలా పుట్టించాలి.. కానీ సమాజంలో రకరకాల అసమానతలు. అంగవైకల్యం..మానసిక వైకల్యంతో తల్లిదండ్రుల గర్భశోకంతో దేవుడు ఆటలాడుకుంటున్నాడని…రియల్ లైప్ లో దేవుణ్ణి నమ్మనని చెప్పిన సందర్భాలున్నాయి.