Home Tollywood హమ్మయ్య ...రిలీఫ్ ఫీలైన ‘సైరా’ టీమ్

హమ్మయ్య …రిలీఫ్ ఫీలైన ‘సైరా’ టీమ్

‘సైరా’రిక్వెస్ట్ కు గవర్నమెంట్ సరేనంది

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇస్తుందా లేదా అన్న టెన్షన్ తో ఉన్న టీమ్ మొత్తానికి రిలీఫ్ ఫీలైంది. ఈ చిత్రం స్పెషల్ షో లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వారం రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శనలకు రాష్ట్ర హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

రద్దీ, బ్లాక్ టికెట్ల నియంత్రణ కోసమే ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొణిదెల ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లేఖ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది.

తొలి స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, నయనతార, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ సైరాను నిర్మించారు.

Related Posts

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ ఊపు తెచ్చిందిగానీ.!

అహహా.. ఎన్నాళ్ళ తర్వాత ఈ సందడి.? అడ్వాన్స్ బుకింగుల జోరు చూసి ఎన్నాళ్ళయ్యింది.? సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ ఇది. ఔను, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన 'లవ్...

మేమే గెలుస్తాం: మంచు విష్ణు ధీమా అదిరింది..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల్లో ఇంతకు ముందెప్పుడూ లేనంత గందరగోళం ఈసారి నెలకొన్న మాట వాస్తవం. దానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రకాష్ రాజ్ ద్వారా హంగామా మొదలైంది.. అక్కడినుంచే...

బిగ్ బాస్ లవ్ స్టోరీలు.. భలేగా రాశారే.!

రియాల్టీ షో అనే పేరు పెట్టారుగానీ, అందులో రియాల్టీ కనిపించడంలేదు మొర్రో.. అంటూ పాపం బిగ్ బాస్ అభిమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు. దానికన్నా యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్‌గా సాగుతోన్న 'మీలో...

Related Posts

Latest News