స‌రిలేరు ఫ‌స్టాఫ్‌లోనే అనిల్ మార్క్ కామెడీ పంచ్‌లు

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన తాజా చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు` ఈ రోజు విడుద‌లైంది. ఆంధ్రాలో ఆరు షోస్‌కి ప‌ర్మిష‌న్ ఇవ్వగా సంక్రాంతి సంద‌డి మొద‌లైపోయింది. అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో సినిమా మొద‌లైంది. స్టార్ట్ అవ్వ‌గానే అదిరిపోయే పంచ్‌లు అనిల్ రావిపూడి పంచ్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అదిరిపోయే కామెడీ పంచ్‌ల‌తో స్టార్టింగ్ సీన్‌తోనే న‌వ్వులు పూయించేశాడు. ఆ వెంట‌నే త‌మ‌న్నాతో సాంగ్ డ్యాంగ్ డ్యాంగ్ సాంగ్ తో సినిమా హాల్ లో ప్రేక్ష‌కులంతా మొత్తం మంచి జోష్‌తో ఉన్నారు. సినిమాను మంచి ఎన‌ర్జీ జోష్‌తో స్టార్ట్ చేశాడు. అనిల్ సినిమా మొత్తం పంచ్‌ల‌తోనే ఫుల్ లాంగించేస్తాడు. ఆయ‌న గ‌త చిత్రాల్లో కూడా అలాగే మంచి ఎన‌ర్జీటిక్ పంచ్‌లు ఉంటాయి. ఇక ఎఫ్‌2 చిత్రంతో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఈయ‌న కామెడీ పండించ‌డంలో త‌న‌దైన శైలితో దూసుకుపోతున్నారు. గ‌తంలో ఇలా ఇవివి స‌త్య‌నారాయ‌ణ చిత్రాలు ఉండేవి. కాక‌పోతే అలా పంచ్‌లు లేక‌పోయినా ఆయ‌న దోర‌క‌మైన కామెడీ ఉండేది. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చే చిత్రాల్లో హెల్దీ కామెడీ కాస్త త‌క్కువైంద‌నే చెప్పాలి.

డ‌బుల్ మీనింగ్ డైలాగ్‌ల‌తో జ‌బ‌ర్ద‌స్త్ పంచ్ డైలాగుల‌తో స‌రిపెట్టేస్తున్నారు మిగ‌తావారంతా. ఇక అనిల్ సినిమాల‌కొచ్చేస‌రికి కాస్త పంచ్‌లు ఉన్నా వెరైటీ కామెడీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. త‌నదైన మార్క్‌తో ఓ మంచి కామెడీని పండిస్తూ ఇటు మాస్‌, అటు క్లాస్ ఆడియ‌న్స్‌కు ఆయ‌న ద‌గ్గ‌ర‌య్యారు.
ఈ చిత్రంతో లేడీ అమితాబ్‌ విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం విశేషం. అనిల్‌రావిపూడి తీసుకున్న స్టార్‌కాస్ట్‌ కూడా ఈ చిత్రానికి చాలా ప్ల‌స్ అవుతుంద‌నే చెప్పాలి. ముఖ్యంగా విజ‌య‌శాంతిని తీసుకోవాల‌న్న ఆలోచ‌నే చాలా గ్రేట్ అని చాలా మంది ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.