స‌క్సెస్ కోసం అందాల రాక్ష‌సి శ్ర‌మిస్తోంది!

`అందాల రాక్ష‌సి` సినిమాతో పేరు తెచ్చుకున్నా లావ‌ణ్య త్రిపాఠికి రావాల్సిన క్రేజ్ ఇంకా ద‌క్క‌లేద‌నే చెప్పాలి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా. శ్రీ‌న‌స్తు శుభ‌మ‌స్తు, అర్జున్ సుర‌వ‌రం వంటి చిత్రాల్లో న‌టించినా క్రేజీ క‌థానాయిక‌గా గుర్తింపును మాత్రం పొంద లేక‌పోతోంది. ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూనే వుంది.

ప్ర‌స్తుతం లావ‌ణ్య చేతిలో రెండు చిత్రాలున్నాయి. `ఏ1 ఎక్స్‌ప్రెస్‌`, `చావు క‌బురు చ‌ల్ల‌గా`. `ఏ1 ఎక్స్‌ప్రెస్‌` చిత్రంలో సందీప్‌కిష‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. `చావు క‌బురు చ‌ల్ల‌గా` సినిమాలో కార్తికేయ గుమ్మ‌కొండ హీరో. ఈ రెండు చిత్రాలపైనే లావ‌ణ్య భారీ ఆశ‌లు పెట్టుకుంది. సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న`ఏ1 ఎక్స్‌ప్రెస్‌` హాకీ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఇందులో లావ‌ణ్య త్రిపాఠి హాకీ ప్లేయ‌ర్‌గా క‌నిపించ‌నుంది. ఇందు కోసం లావ‌ణ్య ప్ర‌త్యేకంగా హాకీ నేర్చుకుంటోంది. `చావు క‌బురు చ‌ల్ల‌గా` చిత్రంలో న‌టిస్తూనే `ఏ1 ఎక్స్‌ప్రెస్‌` కోసం హాకీ శిక్ష‌ణ తీసుకుంటోంది.

ఓ త‌మిళ సినిమా కూడా చేస్తున్న లావ‌ణ్య చెన్నైలో షూటింగ్ అయిపోగానే హైద‌రాబాద్ వ‌చ్చేస్తోంద‌ట‌. ఎర్లీ మార్నింగ్ క్ర‌మం త‌ప్ప‌కుండా హాకీ శిక్ష‌ణ‌కు హాజ‌ర‌వుతోంద‌ట‌. ఆమె ప‌ట్టుద‌ల చూస్తున్న వారంతా `ఏ1 ఎక్స్‌ప్రెస్‌`తో లావ‌ణ్య కొత్త మ‌లుపు తిర‌గాల‌ని కోరుకుంటున్నార‌ట‌.