సుక్కు.. దిల్ రాజుని ఇరికించేశాడు!

సుక్కు.. దిల్ రాజుని ఇరికించేశాడు!

బీ ద రియ‌ల్‌మెన్ ఛాలెంజ్ మాంచి ర‌స‌ప‌ట్టుగా సాగుతోంది. కొంత మంది దీనిపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటే అత్య‌ధిక శాతం మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏదైనా ప‌నికొచ్చే ప‌ని చేయండి గురూ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇదిలా వుంటే సందీప్ రెడ్డి వంగ మొద‌లుపెట్టిన ఈ ఛాలెంజ్ చైన్ లింక్‌గా మారి వైర‌ల్ అవుతోంది.

రాజ‌మౌళి నుంచి ఎన్టీఆర్ లైన్‌లో కొచ్చాడు.. ‌త‌ను టాస్క్ కంప్లీట్ చేసి అంద‌రిని మించి ఓ సాహ‌స‌మే చేశాడ‌నుకోవ‌చ్చు. ఈ ఛాలెంజ్‌లోకి బాబాయ్ బాల‌య్య‌ను లాగ‌డం కొంత రిస్క్ అనిపించినా ధైర్యం చేశాడ‌ని చెప్పొచ్చు. బాల‌య్య‌తో పాటు చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌తో పపాటు కొర‌టాల శివ‌ని కూడా నామినేట్ చేయ‌డంతో బీ ద రియ‌ల్ మెన్ ఛాలెంజ్ మాంచి ర‌స‌ప‌ట్టుగా సాగుతోంది.

రాజ‌మౌళి ఛాలెంజ్ విసిరిన జాబితాలో ఇప్ప‌టికి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ స్పందించి టాస్క్ కంప్లీట్ చేశారు. తాజాగా లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ టాస్క్‌ని పూర్తి చేశారు. అయితే గ‌మ్మ‌త్తుగా ఈ ఛాలెంజ్‌లోకి దిల్ రాజుని ఇరికించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దేవిశ్రీ‌ప్ర‌సాద్‌, వంశీపైడిప‌ల్లి, సురేంద‌ర్‌రెడ్డి, కొర‌టాల శివ‌ని మ‌రోసారి ఛాలెంజ్‌లోకి లాగిన సుకుమార్ ఈ ఛాలెంజ్‌లోకి నిర్మాత దిల్ రాజుని లాగ‌డం ఇంట్రెస్టింగ్ మారింది. ఆయ‌న ఏ నిర్మాత‌ని నామినేట్ చేస్తారో లేక మ‌ళ్లీ హీరోల‌నే టార్గెట్ చేస్తాడో చూడాలి.