‘సాహో’ థాలి అందిస్తున్న ముంబై రెస్టారెంట్

సినిమాలతో హీరోల కెరీర్ ఎలా ఉన్నా వారు కష్టపడి ప్రజలను అలరిస్తే ప్రేక్షకులు వారి పై కురిపించే ప్రేమకి ఒక్కోసారి మాటలు రావు, చాలవు కూడా. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడితే మన పొరుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య మరీ పెరిగిపోయింది. బాహుబలి కి గుర్తుగా ప్రేక్షకులు చాలా చేశారు.

ఇప్పుడు ‘సాహో’ వంతు వచ్చింది. ఇంతటి భారీ యాక్షన్ , భారీ బడ్జెట్ సినిమాకి గుర్తుగా ముంబై లోని ఒక రెస్టారెంట్ ఏకంగా ‘సాహో’ థాలి నే అందిస్తోంది. ముంబైలోని ‘మహారాజ్ భోగ్’ అనే ఈ రెస్టారెంట్ లో ‘సాహో’ సినిమాకి మద్దతుగా విడుదల నాటి నుంచి ముప్పై రోజుల వరకు ‘సాహో’ థాలి అందిస్తుంది. ఈ విషయం తెలిసి ప్రభాస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.