సంగీత దర్శకుడిగా మారుతున్న గాయకుడు సిద్ శ్రీరామ్

చిత్ర పరిశ్రమలో గాయకులు కొంత కాలం గడిచాక సంగీత దర్శకులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలా వారి కెరీర్ ఎంత కాలం ఉంటుందన్నది ప్రశ్న. ఈ ప్రశ్నను పక్కన పెడితే, తాజాగా గాయకుడు సిద్ శ్రీరామ్ సంగీత దర్శకుడు కాబోతున్నారు.

సిద్ శ్రీరామ్ అంటే, హుషారు సినిమాలో ‘ఉండిపోరాదే’ మరియు గీత గోవిందంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలె’, నిన్ను కోరి సినిమాలో ‘అడిగా అడిగా’ వంటి సూపర్ హిట్ పాటలు పాడిన గాయకుడు.
ఈయన ప్రతిభ చూసి దర్శకుడు మణిరత్నం తన కొత్త సినిమా ‘వానం కోట్ఠాతుం’ అనే సినిమాలో ఈ అవకాశం ఇచ్చారు.

ఈ తమిళ సినిమాలో విక్రమ్ ప్రభు మరియు ఐశ్వర్య రాజేష్ నటీనటులు గా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.