ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు ప్రభుత్వాల కంటే ముందు మేమున్నామంటూ ఆపన్న హస్తం అందింస్తోంది టాలీవుడ్. సినిమాల విషయంలో పోటీ వున్నా తామంతా ఒక్కటే అని నిరూపిస్తూ టాలీవుడ్ స్టార్స్ ముందుకొస్తుంటారు. తాజాగా అదే జరుగుతోంది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం భయానక పరిస్థితుల్లోకి వెళ్లిపోయి హాహా కారాలు చేస్తున్న వేళ ఇండియాలో లాక్ డౌన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సామాన్యులకు పని లేకుండా పోయింది వారికి అండగా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూనే ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు.
ముందు తెలంగాణ ప్రభుత్వం కోసం విజయ్ దేవరకొండ కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా ఎదుర్కోవాలో ఓ వీడియో సందేశాన్ని అందించారు. ఆ తరువాత దీని ఉదృతి పెరగడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాఓ తెలియజేస్తూ ఓ వీడియోని వదిలారు. సినీ కార్మికుల కోసం కోటి వారాళాన్ని ప్రకటించిన చిరు వారి కోసం సీసీసీని ఏర్పాటు చేయించారు. తాజాగా కరోనా మహమ్మారిపై ఓ పాటని కోటి రూపొందిస్తే అంటుతో చిరంజీవి, నాగార్జున, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ ఇంట్లో వుండి చేసిన వీడియోని అందంగా ఎడిట్ చేసి పాటకు జత చేశారు. కరోనా అవేర్ నెస్ సాంగ్‌లో బయటికి వచ్చిన ఈ పాట సోషల్ మీడియా, యూట్యూబ్‌లో ఆకట్టుకుంటోంది.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల లెక్కలేకాదు. ఆపద వచ్చినప్పుడు జనం కోసం నిలబడతామని టాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి తమ సహాయ సహకారాలతో నిరూపించడం పలువురిని ఆకట్టుకుంటోంది. దీంతో జనం అంతా శభాష్ టాలీవుడ్.. కరోనాపై అవేర్నెస్ భేష్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
https://www.youtube.com/watch?time_continue=2&v=ySMcUjp3zX8&feature=emb_logo