HomeTollywoodవ‌ర్మ‌కు న‌చ్చేసింది..ఊరుకుంటాడా?

వ‌ర్మ‌కు న‌చ్చేసింది..ఊరుకుంటాడా?

వివాదాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ మ‌ధ్య పేరున్న న‌టీన‌టులతో సినిమాలు తీయ‌డం లేదు. త‌ను అనుకున్న క‌థ‌కు ఎవ‌రు కుదిరితే వారితో సినిమాలు చేస్తున్నాడు. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` చిత్రం కోసం రంగ‌స్థ‌ల న‌టుడైన విజ‌య్ కుమార్‌ని ఎన్టీఆర్ పాత్ర కోసం తీసుకుని సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర్మ తాజాగా `ది గ‌ర్ల్ ఎంట‌ర్ ది డ్రాగ‌న్‌` కోసం రియ‌ల్ ఫైట‌ర్‌ని తీసుకున్న విష‌యం తెలిసిందే.

తాజాగా వ‌ర్మ క‌న్ను టిక్ టాక్ భామ‌పై ప‌డింది. తాజాగా టిక్ టాక్‌లో ఓ అమ్మాయి వీడియో చూసిన వ‌ర్మ ఆమె న‌ట‌న‌కు ఫిదా అయిపోయార‌ట‌. దీంతో త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ని కూడా ఇచ్చేశాడు. ఈ మ‌ధ్య కాలంలో టిక్ టాక్ లో పాపుల‌ర్ అయిన వాళ్లు చాలా మంది వున్నారు. సినీ స్టార్స్ కూడా టిక్ టాక్ వీడియోల‌కు ఎడిక్ట్ అవుతున్న విష‌యం తెలిసిందే.

ఈ విష‌యాన్ని గ్ర‌హించిన వ‌ర్మ ఆక్వా గ‌ర్ల్ ఏకే నే ఐడీలో వున్న ఓ యువ‌తి షేర్ చేసిన వీడియోకి ఫిదా అయిపోయాడ‌ట‌. దీంతో త‌న సినిమాలో న‌టించ‌డానికి ఆస‌క్తి వుంటే ఈ ఇమైల్ ఐడీకి డిటైల్స్ పంపించ‌మ‌ని ఓ ఇమేల్ ఐడీని షేర్ చేశాడు. అయితే దానికి లెక్కు మించి మెయిల్స్ రావ‌డంతో వెంట‌నే ఇమేయిల్ ఐడీని, స‌ద‌రు యువ‌తి టిక్ టాక్ వీడియోని వ‌ర్మ తొల‌గించాడు.

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News