వ‌రుణ్ సినిమాకు స్టార్టింగ్ ప్రాబ్ల‌మ్‌!

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ మెగా కాంపౌండ్‌లో కొత్త త‌ర‌హా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచారు వ‌రుణ్‌తేజ్‌. `ఎఫ్‌2`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని, `గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌`తో హిట్ సినిమాని సొంతంచేసుకున్న వ‌రుణ్‌తేజ్ తాజాగా `బాక్స‌ర్` పేరుతో ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు వెంక‌టేష్ (బాబీ) మ‌రో నిర్మాత సిద్దు ముద్ద‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ప్లాన్ చేశారు.

ఇటీవ‌లే ముహూర్తం కూడా జ‌రుపుకుంది. కిర‌ణ్ కొర్ర‌పాటి ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. వ‌రుణ్‌తేజ్ బాక్స‌ర్‌గా న‌టిస్తున్న ఈ సినిమా కోసం ముంబై వెళ్లి ప్ర‌త్యేకంగా ఓ బాక్సింగ్ కోచ్ వ‌ద్ద బాక్సింగ్ కూడా నేర్చుకుని వ‌చ్చారు. కానీ ప‌ర్‌ఫెక్ట్‌గా మాత్రం ఈ సినిమా కోసం వ‌రుణ్ రెడీ కాలేక‌పోయాడు. దీంతో అనుకున్న స‌మ‌యానికి స్టార్ట్ చేయాల‌నుకున్న షెడ్యూల్ ముందుకు సాగ‌డం లేదు.

మేక‌ర్స్ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ నెల మొద‌టి వారం నుంచి మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేశారు. వ‌రుణ్ రెడీ కాక‌పోవ‌డంతో త‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా రెడీ అయిన త‌రువాతే షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.