`వ‌కీల్ సాబ్‌` నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రెడీ!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న `పింక్‌` రీమేక్‌కు `వ‌కీల్ సాబ్‌` టైటిల్‌ని ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం ఈ చిత్ర టైటిల్‌తో పాటు ప‌వ‌న్ లుక్‌ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేసింది. 24 గంట‌ల్లోనే ఈ ఫ‌స్ట్‌లుక్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ట్రెండింగ్‌లో టాప్ 3లో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ మ‌ధ్య కాలంలో ద‌క్షిణాది సినిమా ఫ‌స్ట్ లుక్ ఈ స్థాయిలో ట్రెండింగ్ కావ‌డం ఇదే తొలిసార‌ని ట్విట్ట‌ర్ కూడా డిక్లేర్ చేసింది. దీంతో ఇచ్చ‌ట పాత రికార్డులు స‌వ‌రించ‌బ‌డును అన్న‌ట్టుగానే తొలి రికార్డు న‌మోదైంది.

ఇక ఈ సినిమా నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్ రెడీ అవుతోంద‌ట‌. ఫ‌స్ట్‌లుక్ లో ప‌వ‌న్ స్టైలిష్‌గా క‌నిపించి సినిమా ఏ రేంజ్‌లో ర‌చ్చ చేయ‌బోతోందో చిన్న హింట్ ఇచ్చేశాడు దీంతో ఫ్యాన్స్ సెల‌బ్రేష‌న్స్ మోడ్‌లోకి వెళ్లిపోయి దిల్ రాజు ఆఫీస్ ముందు బాణా సంచా పేల్చి కేక్ క‌ట్ చేసి మ‌రీ హంగామా చేశారు. ఫ‌స్ట్‌లుక్‌కే ఇలా చేస్తే రేపు రాబోయే ఫ‌స్ట్ సింగిల్‌కి ఇక పూన‌కాలే. ఈ సినిమా కోసం రామ‌జోగ‌య్య శాస్త్రి ఓ అద్భుత‌మైన పాట‌ని సిద్ధం చేశార‌ట‌. దీన్ని త‌మ‌న్ వ‌ద్ద విన్న త్రివిక్ర‌మ్ ప్ర‌శంస‌లు కురిపించిన‌ట్టు స్వ‌యంగా రామ‌జోగ‌య్య శాస్త్రి సోష‌ల్ మీడియా సాక్షిగా బ‌య‌ట‌పెట్టేశాడు.

`త్రివిక్ర‌మ్‌గారు పాట విన్నార‌ట‌. ఇది రామ్ జోది కాదా అని గుర్తు ప‌ట్టార‌ట‌. ఇది నిలిచిపోయే పాట‌వుతుంద‌ని ఆయ‌న చెప్ప‌డం ఆనందాన్ని క‌లిగిస్తోంది` అని రామ‌జోగ‌య్య శాస్త్రి ట్వీట్ చేయ‌డాన్ని బ‌ట్టి చూస్తుంటే `వ‌కీల్ సాబ్‌` కోసం ఏదో స‌ర్‌ప్రైజింగ్ సాంగ్‌ని రామ‌జోగ‌య్య శాస్త్రి ప్లాన్ చేసిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ పాట‌ని ఎప్పుడు రిలీజ్ చేయ‌బోతున్నార‌న్న‌ది మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు.