ఎప్పుడూ గ్లామర్ పాత్రలు, ప్రత్యేక గీతాలు చేసే లక్ష్మి రాయ్ కి ఇప్పుడు నటనకు ఆస్కారం ఉన్న నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర దొరికింది. వివరాల్లోకి వెళ్తే…
కొన్నాళ్ల క్రితం ముంబై కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యోదంతం అందరికీ తెలిసిందే. మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జి తన ఇమేజ్‌కు భంగం కలుగుతుందన్న భయంతో -కన్నకూతురు షీనాబోరాను కర్కశంగా హత్యచేసిన వైనం ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. కేసుపై విచారణ సాగుతుంటే, ఇంద్రాణి మాత్రం జైలు జీవితాన్ని గడుపుతోంది.
ఈ వాస్తవిక క్రైం సంఘటనను టాలీవుడ్లో సినిమాగా తయారవుతోంది. విలనిజంతో సాగే కార్పొరేట్ ఇంద్రాణి క్యారెక్టర్‌ను రాయ్‌లక్ష్మి పోషిస్తోంది. ఈ పాత్ర తనకు దక్కడంపట్ల రాయ్ లక్ష్మి ఆనందాన్నీ వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అనేక రకాల పాత్రలు చేసినా, నెగటివ్ షేడ్స్‌తో సాగే పాత్ర తొలిసారి దొరికిందని, ఈ పాత్రను పండించేందుకు కృషి చేస్తానంటూ చెబుతోంది కూడా.