రౌడీ హీరోయిన్ రేటు పెంచేసింది!

టాలీవుడ్‌లో క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న జోరు కొన‌సాగుతోంది. ఆమెకు వ‌ద్ద‌న్నా వ‌రుస అఫ‌ర్లు వ‌చ్చేస్తున్నాయి. తెలుగులో క్రేజీ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటోంది. క‌న్న‌డ నాట కిర్రాక్ పార్టీతో యువ‌త హృద‌యాల్ని కిర్రాక్ చేసినా.. ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేసింది. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి గీత‌ గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో ర‌చ్చ చేసింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు`లో నీకు అర్థ‌మౌతోందా .. అంటూ అల్ల‌రి చేసి ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం క్రేజీ హీరోయిన్‌ల కొర‌త వుండ‌టంతో ఆ లోటుని భ‌ర్తి చేస్తూ త‌న క్రేజ్‌ని పెంచేసుకుంటోంది. ప్ర‌స్తుతం నితిన్‌తో `భీష్మ‌` చిత్రంలో న‌టిస్తున్న ర‌ఫ్మిక త‌మిళంలో కార్తితో క‌లిసి `సుల్తాన్‌` సినిమా చేస్తోంది. ఇది ఆమె న‌టిస్తున్న తొలి త‌మిళ చిత్రం. ఈ చిత్రాల‌తో పాటు అల్లు అర్జున్‌, సుకుమార్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమాలోనూ న‌టించే ఛాన్స్ కొట్టేసింది. ఈ నెల రెండ‌వ వారం నుంచి సుక్కు మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ రౌడీ బేబీ త‌న పారితోషికం భారీగానే పెంచేసిన‌ట్టు తెలిసింది. కెరీర్ తొలి నాళ్ల‌లో ల‌క్ష‌ల‌తో స‌రిపెట్టుకున్న ర‌ష్మిక ఇప్పుడు ఏకంగా కోటిన్న‌ర నుంచి రెండు కోట్లు డిమాండ్ చేయ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని షాక్ కు గురిచేస్తోంది.