రెజీనా లుక్ ఇంట్రెస్టింగ్‌గా వుందే!

వ‌రుస ఫ్లాపుల‌తో కెరీర్ ఇక క‌ష్ట‌మే అనుకున్న త‌రుణంలో `ఎవ‌రు` హిట్‌తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యింది హాటీ బ్యూటీ రెజీనా. అడివి శేష్ ప‌క్కా ప్లానింగ్‌తో చేసిన ఈ చిత్రం నిర్మాత పీవీపీకి లాభాల పంట పండించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో రెజీనా ప్ర‌స్తుతం త‌మిళంలో వ‌రుస‌గా ఐదారు చిత్రాల్లో న‌టిస్తోంది. అందులో ఓ చిత్రం తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. కార్తిక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న త‌మిళ చిత్రం `సూర్ప‌ణ‌గై`.

ఇదే చిత్రాన్ని తెలుగులో `నేనే నా?` అనే పేరుతో నిర్మాత రాజ్ శేఖ‌ర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని మంగ‌ళ‌వారం హీరో వ‌రుణ్‌తేజ్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ లుక్‌లో ఇనుప చువ్వ‌ల మ‌ధ్య బందీగా ర‌క్త‌మోడుతున్న యువ‌రాణిగా రెజీనా లుక్ కొత్త‌గా వుంది. సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థ‌తో ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ట‌. ఇందులోని పోరాట ఘ‌ట్టాల్లోనూ రెజీనా ప్ర‌త్యే శిక్ష‌ణ తీసుకుని న‌టించింద‌ని, అవి చిత్రానికి మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.

రెజీనాని కొత్త కోణంలో ఈ సినిమా ఆవిష్క‌రించ‌బోతోంద‌ట‌. త్వ‌ర‌లోనే తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, క‌న్నడ బ్యూటీ అక్ష‌రా గౌడ కూడా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది.