‘ఉయ్యాలా జంపాల’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో రాజ్ తరుణ్. అటు పైన ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను నిలుపుకోలేక పోయాడు. ఆ మధ్య మారీ ఘోరమైన సినిమా చేసి దెబ్బ తిన్నాడు. దాంతో మేల్కొని పెద్ద నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేసాడు.
ఆ సినిమా కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే దిల్ రాజు ఆ చిత్రం విడుదలను వాయిదా వేసాడు. కారణం ఏమంటే, తాజాగా కారు ప్రమాదంలో తరుణ్ దొరికిపోవడం ఆ పైన ఆయన వైఖరి అందరూ స్వయంగా చూసారు. దాంతో అతని అబద్ధాలా ప్రభావం అతని ఇమేజ్ ను కొంచెం దెబ్బ తీసి ఉండవచ్చు. ఆ ప్రభావం తన సినిమా పై పడకూడదని వాయిదా వేసాడట రాజు.
ఏది ఏమైనా అనుభవం గల నిర్మాతగా తన జాగ్రత్త తానూ తీసుకున్నాడు. ఎటొచ్చే రాజ్ తరుణ్ కె ఇప్పుడు కష్టమంతా అనుకుంటున్నారు. ఎందుకంటే తన కెరీర్ ఉన్న పరిస్థితిలో తనకు సినిమా, సినిమా విజయం అత్యంత కీలకం. చూద్దాం మరి రాజ్ తరుణ్ ఏం చేస్తాడో.