రాజ్ తరుణ్ కు భారీ షాక్: బయిటపడ్డ వీడియో సాక్ష్యం

యాక్సిడెంట్ కేసులో రాజ్ తరుణ్ కు కొత్త ట్విస్ట్

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్ పడింది. తాగి డ్రైవ్ చేయలేదని తప్పించుకోవాలని చూసిన రాజ్ తరుణ్ గుట్టు రట్టైంది. కారు ప్రమాదం జరిగిన చోట ఆ ఘటనను స్థానికుడు కార్తీక్ రికార్డు చేయటంతో ఆ విషయాలన్నీ బయిటకువచ్చాయి. రికార్డ్ చేసిన కార్తీక్ ను రాజ్ తరుణ్ తరపు వ్యక్తులు బెదిరించారని, వాటికి సంభందించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని కార్తీక్ చెప్పటంతో రాజ్ తరుణ్ కు భారీ షాక్ తగిలినట్లైంది. 

వివరాల్లోకి వెళితే..ఈ నెల 20వ తేదీన సినీ నటుడు రాజ్ తరుణ్ కారు అలకాపురి సమీపంలో ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం గురైన తర్వాత రాజ్ తరుణ్ పరుగెత్తుకొంటూ వెళ్లే దృశ్యాలు సీసీ టీవీల్లో కూడ రికార్డయ్యాయి. అయితే ఏం జరిగిందీ ఎవరికీ ఏమీ అర్దం కాలేదు. అసలేమీ జరగలేదని, తాను భయంతోనే పారిపోయానని రాజ్ తరణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియచేసాడు. అయితే ఇక్కడే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.రాజ్ తరుణ్ కారు ప్రమాదానికి గురైన తర్వాత స్థానికుడు కార్తీక్ ఈ ప్రమాద దృశ్యాలను రికార్డు చేశాడు.ప్రమాదం చేసిన తర్వాత రాజ్ తరుణ్ ను కార్తీక్ పట్టుకొన్నాడు.

కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ…కారు ప్రమాదాన్ని తాను ఇంటి బాల్కనీ నుండి చూసినట్టుగా చెప్పాడు. ప్రమాదం జరిగిన కారు నుండి ఓ వ్యక్తి పారిపోతూ ఉండడాన్ని చూసి హత్య చేసి పారిపోతున్నాడా అని భావించి తాను అతడిని పట్టుకొన్నట్టుగా కార్తీక్ తెలిపారు. ఆ తర్వాత తానే రాజ్ తరుణ్ ను ఇంటి వద్దే దింపినట్టుగా కార్తీక్ చెప్పారు. ఈ క్రమంలో మద్యం తాగి రాజ్ తరుణ్ కారు నడిపినట్టుగా తనకు చెప్పాడని కార్తీక్ వివరించాడు.

ఈ సమయంలోనే తామిద్దరం కూడ ఫోన్ నెంబర్లను తీసుకొన్నట్టుగా కార్తీక్ తెలిపారు. తాను ఇంటికి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనకు ఫోన్ చేస్తే ప్రమాదం గురించి అడిగినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరును రాజ్ తరుణ్ తనకు పూసగుచ్చినట్టుగా చెప్పారని కార్తీక్ వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటన స్థలంలో తాను తీసిన వీడియోను డిలీట్ చేయాలని రాజ్ తరుణ్ తనను కోరినట్టుగా కార్తీక్ మీడియాకు తెలిపారు.

మరునాడు తనకు తన మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేస్తాడని రాజ్ తరుణ్ చెప్పారని… రాజ్ తరుణ్ చెప్పినట్టుగానే రాజా రవీంద్ర తనకు ఫోన్ చేశారని కార్తీక్ తెలిపారు. ఈ వీడియోలను డిలీట్ చేస్తే తననకు డబ్బులు ఇస్తారని చెప్పారని ఆయన తెలిపారు. తన వద్ద ఉన్న వీడియోలను డిలీట్ చేయాలని రాజ్ తరుణ్ తరపున వ్యక్తులు కోరారు. రాజ్ తరుణ్ తో పాటు మేనేజర్ రాజా రవీంద్ర ఫోన్ చేసినట్టుగా కార్తీక్ చెప్పారన్నారు.

తనకు డబ్బులు ఇస్తాననని రాజా రవీంద్ర కూడ చెప్పారన్నారు. తనతో రాజ్ తరుణ్ తరపున మాట్లాడిన కొందరు బెదిరించారని కార్తీక్ చెప్పారు.ఈ ఆడియో సంభాషణలు కూడ ఉన్నాయన్నారు. అంతేకాదు ఓ మహిళ తనకు ఫోన్ చేసి ఈ వీడియోలను డిలీట్ చేయాలని కోరిందన్నారు. ఈ విషయమై ఆమె తనను అసభ్యంగా దూషించిందని కూడ ఆయన ఆవేదన చెందారు.