యూనిట్ స‌భ్యుల ప్రాణాల‌తో హీరో చెల‌గాటం!

56 మంది జీవితాల్ని రిస్క్‌లో పెట్టిన పృథ్వీరాజ్‌!

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. దేశాల‌న్నీ లాక్‌డౌన్‌ని విధించి క‌రోనా క‌ట్ట‌డికి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాయి. సినిమా వాళ్లు షూటింగ్‌లు వాయిదా వేసి ఇంటి ప‌ట్టునే వుంటున్నారు. అయితే ఓ హీరో మాత్రం ప్రాణాల‌ని సైతం లెక్క‌చేకుండా త‌న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇంత‌కీ ఆ న‌టుడు ఎవ‌రు? ఏ మా సినిమా? అని ఆరా తీస్తే మ‌ల‌యాళ హీరో పృథ్విరాజ్ అని, ఆ మూవీ `ఆడు జీవితం` అని తెలిసింది.

ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ కార‌ణంగా వ‌ణికి చ‌స్తుంటే మ‌ల‌యాళ హీరో పృథ్విరాజ్ మాత్రం తన‌ సినిమా షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్ల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దేశం మొత్తం లాక్ డౌన్ కార‌ణంగా సామాన్యులు, సెల‌బ్రిటీలు, సినీ తార‌లు అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోతే హీరో పృథ్విరాజ్ మాత్రం `ఆడు జీవితం` పేరుతో రూపొందుతున్న సినిమా షూటింగ్ చేస్తున్నాడు. అత‌ని కార‌ణంగా యూనిట్ స‌భ్యుల ప్రాణాలు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డిపోయాయి. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం క‌ల‌గ‌జేసుకుని పృథ్విరాజ్ కు అత‌ని టీమ్‌కు బుద్ధి చెప్పాల‌ని. షూటింగ్‌ని ర‌ద్దు చేసి సుర‌క్షితంగా టీమ్ స్వ‌దేశం తిరిగి వ‌చ్చేలా చేయాల‌ని కేర‌ళ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కోరుతున్నాయి.

ఇటీవ‌ల `జాన్‌` సినిమా కోసం ఇట‌లీ, జార్జియాలో ప్ర‌భాస్ టీమ్ షూటింగ్ చేసి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. పృథ్వీరాజ్ గురించి తెలుసుకున్న వాళ్లు ప్ర‌భాస్‌నే మించిపోయాడే అని అవాక్క‌వుతున్నార‌ట‌.