యువి క్రియేషన్స్ బ్యానర్లో వరుణ్ తేజ్ సినిమా దర్శకుడెవరంటే…

యువ హీరో వరుణ్ తేజ్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో కుదురుకుంటున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం ‘వాల్మీకి’ అంటూ సెప్టెంబర్ 20 న మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ తరువాత కొంత విరామం తీసుకోవడానికి యూరోప్ వెళ్లి ఈ మధ్యనే తిరిగి వచ్చాడు. తన తదుపరి సినిమాల కోసం సిద్ధం అవుతుండగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా ఒప్పందం కుదిరింది.

అసలు ఈ బ్యానర్ వరుణ్ తో సినిమా చేయడానికి ఎప్పటి నుండో చూస్తుండగా మంచి కధ దొరికేసరికి ఈ మాత్రం ఆలస్యం అయింది. వివరాల్లోకి వెళ్తే, దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పిన కధ వరుణ్ కి తెగ నచ్చేసిందట. ఇంకేముంది హీరో తో పాటు బ్యానర్ కూడా సిద్ధం అయిపొయింది.

దాంతో దర్శకుడు ఈ సినిమాకి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో ఉన్నారట. ఏది ఏమైనా ఈ సినిమా పట్టాలెక్కడానికి ఒక రెండు మూడు నెలలైనా పడుతుంది. ఈ లోపు వరుణ్ తన ‘వాల్మీకి’ సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటాడు.