మ‌హేష్ రెమ్యూన‌రేష్ బాదుడు మాములుగా లేదుగా…?

ఒక్క సినిమా హిట్ అయితే చాలు హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ రెమ్యూన‌రేష‌న్లు ఆకాశాన్నంటే రేంజ్‌లో ఉంటాయి. ఇక ఆల్రెడీ సూప‌ర్‌స్టార్లుగా రాజ్యాన్ని ఏల‌త‌న్న హీరోల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌, బ‌న్నీ వీళ్ళంద‌రూ ఒక రేంజ్ లో ఉంటారు. ఇక మ‌హేష్ విష‌యానికి వ‌స్తే ఇప్పటికే నిర్మాతల దగ్గరనుండి ట్రేడ్ పండితుల వరకూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. సినిమా బడ్జెట్ లో దాదాపు 60 శాతం రెమ్యునరేషన్స్ కే వెళ్ళిపోతున్నాయన్న వార్త కూడా తెలిసిందే. అందుకు హీరోలు కొత్త రూటే పట్టారు. అసలు తమకు రెమ్యునరేషన్ వద్దు అంటున్నారు. అలా అని ఫ్రీ గా చేస్తార‌నుకోకండి అస‌లు బాదుడంతా ఇక్క‌డే ఉంది.. రెమ్యునరేషన్ బదులు సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ కుదిరితే రెండూ, ఇంకా పనవుతుంది అనుకుంటే హిందీ డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్ని రకాలుగా తమ రేంజ్ ను బట్టి రాయించేసుకుంటున్నారు. నిజానికి ఈ పద్దతే బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు రెమ్యునరేషన్ పెరిగిపోతోందన్న గొడవ లేదు, పైగా రెమ్యునరేషన్ కన్నా భారీ మొత్తాలు ఈ రైట్స్ తీసుకోవడం వల్ల అందుకోవడానికి కుదురుతుంది.

 

అయితే నిర్మాతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లయింది. రెమ్యునరేషన్ ఎక్కువని గొడవ చేస్తే అది తగ్గించుకోవాలి కానీ ఇలా రైట్స్ అంటూ నిర్మాతల జేబులో డబ్బు గుల్ల చేస్తే ఎలా అని లబోదిబోమంటున్నారు. అయితే టాప్ హీరోలు కాబట్టి బయటకు చ‌ప్ప‌లేక కక్క‌లేక మింగ‌లేక అన్న‌ట్లుంది ప‌రిస్థితి. ఇక ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో ఉన్నాడు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌. సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే దాదాపు 40 కోట్ల రూపాయల వరకూ మహేష్ కు ముడుతోందిట. అయితే ఇది రెమ్యునరేషన్ లెక్క కాదు కాబట్టి సినిమాపై భారం పడదు. తమ ఫేస్ వ్యాల్యూ, ఆ హీరోకి ఉండే క్రేజ్‌ని బ‌ట్టి సినిమాకు బిజినెస్ అవుతుంది కాబట్టి ఈ మాత్రం పుచ్చుకోవచ్చు అన్న ధోరణిలో ఉన్నారు మ‌న‌ హీరోలు.

 

మహేష్ విషయమే తీసుకుంటే మహర్షికి దాదాపు 25 కోట్లు తీసుకున్న మహేష్ ఈసారి మరో 15 కోట్లు ఎక్కువ అందుకోనున్నాడు. సరిలేరు నీకెవ్వరు కు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ మహేష్ కే పట్టం కట్టేసారు. సాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి 30 కోట్లు వచ్చాయి. అలాగే హిందీ డబ్బింగ్ హక్కుల కింద 15 కోట్లు వచ్చాయి. మ్యూజికల్ రైట్స్ కింద మరో కోటి వచ్చినట్లు సమాచారం. ఇక అన్ని టాక్స్ లు తీసేస్తే మహేష్ కు దాదాపు 40 కోట్లు ముడుతున్నాయిట. గ‌తంలో పీవీపి తీసిన బ్ర‌హ్మోత్సం సినిమా కూడా అలాగే అయింది. బ్ర‌హ్మోత్సవం ఫ్లాప్ మూవీ దీంతో పీవీపీ తిరిగి సినిమాకి ప్లాన్ చేయ‌లేక‌పోయాడు. అంటే ఏదైన ఒక సినిమా తీస్తే ఆ సినిమా హిట్ అయితే ప‌ర్వాలేదు. లేదంటే ఇక నిర్మాత ప‌రిస్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా ఇండ‌స్ట్రీ నుంచి వాక్ అవుట్ అన్న‌ ప‌రిస్థితి ఉంటుంది. ఇక మ‌ళ్ళీ ఏద‌న్నా భారీ బ‌డ్జెట్ సినిమా ప్లాన్ చెయ్యాలంటే ఆ నిర్మాత కి అంత సీన్ ఉండ‌దు.