మ‌రో రామ‌ల‌క్ష్మికి లుక్‌ టెస్ట్ ఫినిష్‌!

Rashmika Mandanna

స‌మంత‌ని `రంగ‌స్థ‌లం` చిత్రం కోసం రామ‌ల‌క్ష్మీగా తీర్చి దిద్దిన లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ఈ సారి కూడా అదే ఫార్ములాని ఫాలో అయిపోతున్నాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఓ మాస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం ఇప్ప‌టికే ఓ షెడ్యూల్‌ని అల్లు అర్జున్ లేకుండానే పూర్తి చేసిన సుకుమార్ ఈ నెల ద్వితీయార్థంలో రెండ‌వ షెడ్యూల్‌ని కేర‌ళ‌లో ప్రారంభించ‌బోతున్నాడు.

శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగిన గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమాని రూపొందించ‌బోతున్నాడు. అల్లు అర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా నెగెటివ్ ట‌చ్ వున్నఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా క‌న్న‌డ సోయ‌గం రష్మిక మంద‌న్న‌ను సుకుమార్ ఇప్ప‌టికే క‌న్ఫ‌మ్ చేశారు. అయితే తాజాగా త‌ను అనుకున్న పాత్ర కోసం రష్మికపై లుక్ టెస్ట్ చేసిన‌ట్టు తెలిసింది. గ్రామీణ యువ‌తిగా చిత్తూర్‌లోని అభ‌యార‌ణ్యంలో వుండే అమ్మాయిగా రష్మిక పాత్ర చిత్రీణ వుండ‌నుంద‌ని, దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ సంతృప్తిక‌రంగా రావ‌డంతో సుక్కు ఫుల్ హ్యాపీగా వున్నాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.