బాహుబలితో టాలీవుడ్ జక్కన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి తర్వాత రాజమౌళి ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. భారీగా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే బడా నిర్మాత డీవీవీ దానయ్య 300 కోట్ల రూపాయలు ఈ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ఖర్చు పెట్టనున్నారు. రాజమౌళి తన ప్రతి సినిమాని హిట్ చేయడానికి ఎంతో ప్రణాళికతో ప్రమోట్ చేస్తుంటారు. అలాంటిది ఇంత భారీ సినిమాని సక్సెస్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నాడో అనే సందేహం అందరికి ఉంటుంది అనడంలో సందేహం లేదు.
ఈ మూవీ కోసం కూడా రాజమౌళి ప్రమోషన్ ప్లాన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసేశాడట. ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేసుకున్నాడట. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తే పెద్దగా లాభం ఏమి ఉండదు. ఇండియాలో బావులవుడ్ ఇండస్ట్రీ పెద్దది. సో ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడట దర్శకధీరుడు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ కి మంచి ఇమేజ్ ఉంది. అందుకే అక్కడ మార్కెటింగ్ కోసం కరణ్ జోహార్ ని రంగంలోకి దింపనున్నాడని సమాచారం. బాహుబలి సక్సెస్ లో కూడా కరణ్ హస్తం ఉంది. ఈసారి కూడా కరణ్ ఇమేజ్ ని వాడుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది.