టాలీవుడ్లో నెపోటిజమ్ ఎక్కువ అని, ఒక వర్గానికి చెందిన వారిదే ఇక్కడ ఆదిపత్యమని, వారు తప్ప మిగతా వారు ఇక్కడ ఎదగడానికి ఛాన్స్ ఇవ్వరని గత కొన్నేళ్లుగా విమర్శలు వినిపిస్తూనే వున్నాయి. దీనిపై ఎవరికి వారు నమ్మగర్భంగా సెటైర్లు వేస్తూనే వున్నారు. భరద్వాజా లాంటి వాళ్లు అప్పుడప్పుడు ఇలాంటి వాటిపై కాకున్నా ఇండైరెక్ట్‌గా నెపోటిజమ్ (బందుప్రీతి)పై సెటైర్లు వేశారు కూడా. ఈ మధ్య నెపోటిజమ్‌పై కొన్ని మీడియా వర్గాలు బాహాటంగానే టాలీవుడ్ హీరోలని ప్రశ్నిస్తున్నాయి.
తాజాగా ఇదే ప్రశ్న బన్నీకి ఎదురైంది. ఇండస్ట్రీలో వున్న నెపోటిజమ్‌పై మీ అభిప్రాయం ఏంటని చాలా మంది రిపోర్టర్స్ బన్నీని అడుగుతున్నారట. దీనిపై స్ట్రెయిట్‌గా స్పందించి షాకిచ్చారు. బన్నీ నటించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో`. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఆదివారం విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. దీంతో చిత్ర బృందం థ్యాక్స్ మీట్‌ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ నెపోటిజమ్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఒక పూజారి తన జీవితాన్ని దేవుడి కోసమే అంకితం చేశాడు. అతని కొడుకు, మనవడు ఇలా తరాలు తమ జీవితాన్ని అంకితం చేశాయి. అలాగే సినిమా ఇండస్ట్రీకి మా తాతయ్య, ఆ తరువాత మా నాన్న.. ఇప్పుడు నేను ఈవితాలని అంకితం చేశాం. ఇలా చేయడం నెపోటిజమ్ అయితే యస్.. మాది బంధుప్రీతే అని ప్రకటించడం సంచలనంగా మారింది.