మెగా హీరోకు కూడా ఆమే కావాల‌ట‌!

టాలీవుడ్‌లో హీరోయిన్‌ల కొర‌త వుంది. చిన్న‌ హీరోల నుంచి పెద్ద హీరోల వ‌ర‌కు హీరోయిన్ దొర‌క్క నానా ఇబ్బందులు పడుతున్నారు. సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ, నాగార్జున‌, వెంక‌టేష్ హీరోల కోసం ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి. చిరు సినిమా నుంచి త్రిష త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో కాజ‌ల్‌ని ఒప్పించ‌డానికి భారీగా పారితోషికం అంద‌జేయాల్సి వ‌చ్చింది. బాల‌య్య‌కు హీరోన్ సెట్ట‌వ్వ‌క‌పోవ‌డంతో చివ‌రికి ఎవ‌రు దొరికితే వారితో అడ్జ‌స్ట్ అయిపోతున్నారు.

నాగ్ ప‌రిస్థితీ అంతే `వైల్డ్ డాగ్` కోసం హీరోయిన్ ఎవ‌రూ సెట్ కాక‌పోవ‌డంతో బాలీవుడ్ ఫేడ‌వుట్ హీరోయిన్ దియా మీర్జాతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. వెంకీ ప‌రిస్థితీ అందుకు భిన్నంగా ఏమీ లేదు. సీనియ‌ర్ హీరోల ప‌రిస్థితి ఇలా వుంటే స్టార్ హీరోల‌కు పూజా హెగ్డేనే పెద్ది దిక్కుగా మారింది. ఆ త‌రువాత స్టార్స్ అత్య‌ధికంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న. ఇటీవ‌ల మ‌హేష్‌తో `స‌రిలేరు నీకెవ్వ‌రు`, నితిన్‌తో `భీష్మ‌` వంటి హిట్ చిత్రాల్లో న‌టించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

తాజాగా అల్లు అర్జున్‌తో సుకుమార్ చిత్రంలో జ‌త‌క‌డుతోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డటంతో ప్ర‌స్తుతం ఖాలీగా వుంది. త‌మిళంలో కార్తితో క‌లిసి `సూల్తాన్` చిత్రంలో న‌టిస్తున్న‌ర‌ష్మ‌కపై మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ క‌న్నుప‌డింద‌ట‌. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ర‌ష్మిక‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల‌ సంప్ర‌దించార‌ట‌. మెగా ఆఫ‌ర్ త‌లుపు త‌ట్ట‌డంతో రష్మిక వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. తాజా ప‌రిస్థితులు ఓ కొలిక్కి వ‌చ్చాక ఏప్రిల్ నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ట‌.