మెగా ఫ్యామిలీతో వివాదం లేదని చెప్పటానికేనా బన్ని ఇలా

సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ …అదిరిందట

మెగా ఫ్యామిలీలో మరోసారి మనస్పర్థలు వచ్చాయని.. ఈ నేపధ్యంలో ఆ మధ్య జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ రాలేదంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయాలు ఆయన దాకా వెళ్లినా కూడా వాటిపై బన్నీ కూడా స్పందించకపోవడం జరిగింది. అదే సమయంలో.. మరోవైపు రామ్ చరణ్, చిరంజీవి ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉండటంతో అభిమానుల్లోకి కూడా రాంగ్ సిగ్నల్స్ వెళ్లాయి.

అయితే ఈ విషయం తెలిసిందో ఏమో… వాటి అన్నిటికి క్లియర్ చేస్తూ ఓ ట్వీట్ చేసాడు అల్లు అర్జున్. తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో.. సైరా సినిమా కోసం తానెంత వేచి చూస్తున్నానో చెప్తూ బన్నీ ఆ ట్వీట్ లో చెప్పారు. అయితే ఆ ట్వీట్ కూడా కావాలనే వేసాడని, రేపు తన సినిమా రిలీజ్ అయితే మెగా సపోర్ట్ ఉండకుండా పోతుందనే భావనతో ఈ పని చేసాడని విమర్శలు వినిపించాయి.

ఈ నేపధ్యంలో అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్ సైరా యూనిట్‌కు పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీలోని కొంత మంది హీరోల‌తో పాటు, సైరా చిత్ర యూనిట్, కొంత మంది ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, అఖిల్ అక్కినేని, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, శ్రీకాంత్‌, త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి, వంశీ పైడిప‌ల్లి, హ‌రీశ్ శంక‌ర్‌, సుకుమార్‌, బ‌న్నీ వాసు, జెమినికిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

దాదాపు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో సినిమా తెర‌కెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు ముందే మంచిక్రేజ్ తెచ్చుకుంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కించి హిట్ కొట్టడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్స్‌ను గ‌ట్టిగానే రాబ‌ట్టుకుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles