మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి ఇప్పటి వరకు నక్సలైట్ క్యారెక్టర్లో కనిపించలేదు. మంచు ఫ్యామిలీ నుంచి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు (అడవిలో అన్న), నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ (శ్రీరాములయ్య) నక్సలైట్ పాత్రలో మెరిసారు. ఇక అక్కినేని ఫ్యామిలీకి ఆ అవకాశ రాలేదు. తొలిసారి మెగా ఫ్యామిలీకి ఆ అవకాశం దక్కింది. ఈ ఫ్యామిలీ నుంచి మెగా హీరో రామ్‌చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నారు.
సామాజిక సందేశాన్ని జోడించి కమర్షియల్ చిత్రాన్ని తెరకెక్కించే కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవి ఎండోమెంట్ అధికారి గోవిందాచార్యగా కనిపించబోతున్నారు. ఇదే చిత్రంలో రామ్‌చరణ్ సిద్ధార్ధ్ అనే నక్సలైట్‌గా నటిస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నక్సలిజం నేపధ్యం ప్రధానంగా చిరు సినిమా సాగుతుందని, ఇందులో చరణ్ పాత్ర నిడివి 30 నిమిషాల పాటు వుంటుందని, ఈ పాత్ర సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్ర వర్గాలు స్పందించడం లేదు. ప్రస్తుతం కోకా పేట్లో ఈ చిత్రానికి సంబంధించిన కీ సీన్స్‌ని షూట్ చేస్తున్నారు.