`సైరా` తరువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు స్వయంగా చిరు వెల్లడించారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా నూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, కొరటాల స్నేహితుడు నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే దాదాపుగా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో చిరు `ఆచార్య` షూటింగ్‌ని కూడా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇందులో చిరంజీవి ఎండోమెంట్ అధికారిగా నటిస్తున్నారు. కీలక అతిథి పాత్రలో రామ్‌చరణ్ నటించబోతున్నాడు. అయితే ఈ పాత్రలో మహేష్ నటిస్తాడని, ఈ పాత్ర కోసం భారీగానే పారితోషికం ఆశించడంతో ఆ పాత్రని మళ్లీ రామ్‌చరణ్ చేతే చేయించాలని చిరు నిర్ణయించుకున్నారని వార్తలు షికారు చేశాయి.
అయితే ఆ వార్తల్లో నిజం లేదంటున్నారు చిరు. ఈ పాత్ర కోసం అసలు మహేష్‌ని అడగనేలేదని వెల్లడించి షాకిచ్చాడు. ముందు నుంచి ఈ పాత్ర కోసం రామ్‌చరణే అనుకున్నామని స్పష్టం చేశాడు. ఇక రామ్‌చరణ్ డేట్స్ అడ్జస్ట్ చేయాల్ని బాధ్యతల రాజమౌళిపైనే వుందని అసలు ట్విస్ట్ ఇచ్చాడు. రామ్‌చరణ్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్నాడు. అది పూర్తయితే కానీ రామ్‌చరణ్ ఫ్రీకాడు. తను ఫ్రీ కావాలంటే రాజమౌళి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి.