మూడు నెలల విరామం తర్వాత షూటింగ్‌లో కాజల్‌ ‌!

కరోనా తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు చిత్రీకరణకు కఠినమైన మార్గదర్శకాలు, షరతులు విధించాయి. తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినా సెట్స్‌పైకి వెళ్లేందుకు భయపడుతున్నారు.ఎలా ఉంటుందో చూద్దామని సీరియళ్ల షూటింగ్‌ మొదలు పెడితే.. చాలా మందికి కరోనా రావడంతో తాత్కాలికంగా వాటి షూటింగ్‌లు నిలిపేశారు.

Read More : సీఎం జ‌గ‌న్ పై పూరి ప్ర‌శంస‌ల జ‌ల్లు

తాజాగా కాజల్‌ అగర్వాల్‌ ముంబయిలో షూటింగ్‌లో పాల్గొంది. అక్కడ సినిమా షూటింగ్‌లు మాత్రం ప్రారంభం కాలేదు. సీరియళ్ల చిత్రీకరణే ఈనెల 25 నుంచి మొదలైంది. కాజల్‌ మాత్రం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఓ ప్రకటన షూట్‌లో పాల్గొంది.

Read More : వ‌ర‌ల్డ్ వార్-జీని త‌ల‌పిస్తున్న ఏపీ-తెలంగాణ బోర్డ‌ర్!

సుమారుగా మూడు నెలల విరామం తర్వాత షూటింగ్‌లో పాల్గొడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడు మళ్లీ ప్రాణం లేచివచ్చినట్టు అనిపించిందని పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగ్‌ చేస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని తనకు అనిపిస్తున్నట్టు తెలిపింది. ఈ కథానాయిక తెలుగులో చిరంజీవి సరసన ‘ఆచార్య’, కమల్‌ చిత్రం ‘భారతీయుడు 2’ చిత్రంలోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే.